Top Bar Ad

Breaking News

24x7onlinenews.com- శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం, జిల్లెలగూడ (05.01.19): వైభవంగా తిరుప్పావై గోష్ఠి గాన కార్యక్రమం

 వైభవంగా తిరుప్పావై గోష్ఠి గాన కార్యక్రమం

పవిత్ర ధనుర్మాసాన్నిపురస్కరించుకుని ఆండాళ్ తల్లి అందించిన దివ్య ప్రబంధం తిరుప్పావై గోష్ఠి, గాన కార్యక్రమం జనవరి 5వ తేదీ శనివారం జిల్లెలగూడ శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం ప్రాంగణంలో జరిగింది. ఉ.వే. శ్రీ డింగరి రామాచార్యుల ఆధ్వర్యంలో, శ్రీమతి వి. సువర్ణ కుమారి సారథ్యంలో  తిరుప్పావై పాశురాలను భక్తి శ్రద్ధలతో ఒక పాశురాన్ని ఒకరు చొప్పున 28 మంది చక్కగా, అర్థవంతంగా గానం చేసారు.

ఆళ్వార్ అంటే మునుల వంటి వారని, భగవత్ తత్వాన్ని బాగా తెలిసిన వారని అర్థం. భగవంతుడే తనకు ప్రీతిపాత్రులుగా అనుగ్రహించి తయారు చేసుకున్న భక్తులను ‘దివ్యసూరు’లని ‘ఆళ్వార్’ అని మనం కీరిస్తున్నాం.  పన్నెండు మంది ఆళ్వారులలో ‘ఆండాళ్’ (గోదాదేవి) ఒకరు.

ఆళ్వార్ అనే తమిళ పదానికి అర్థం భగవదనుభవంలో మునిగి తేలినవారు. భగవత్ కటాక్షముతో పరిపూర్ణితని, పక్వ స్థితిని పొందిన విష్ణుభక్తులు.

శ్రీవిల్లిపుత్తూరులో విష్ణుభక్తుడైన శ్రీ విష్ణుచిత్తులకు తులసివనంలో లభించిన కుమార్తె ‘ఆండాళ్’ (గోదాదేవి). ఈమెను విష్ణుచిత్తుల దంపతులు చాలా అల్లారుముద్దుగా పెంచుకున్నారు. యుక్త వయస్సులో వచ్చిన తరువాత గోదా దేవి, శ్రీవారు అయిన రంగనాథుడినే తన పతిగా పొందాలని తలచినది. విష్ణుచిత్తులవారు ప్రతిరోజూ స్వామివారికి పూలమాలలు అలంకరణగా తీసుకోని వెళ్ళేవారు, అయితే వాటిని గోదాదేవి ముందే ధరించి తరువాత స్వామివారికి పంపించసాగినది, ఓ రోజు ఈ రహస్యం తండ్రి అయిన విష్ణుచిత్తులవారికి తెలిసి చాలా దుఃఖించి స్వామివారికి మాలాధారణ కావించరు, దానితో స్వామి మొహం చిన్నబోతుంది, దీనికంతటికీ తన కుమార్తె తప్పిదమే కారణమి చాలా చాలా బాధపడుతుంటే స్వామివారు విష్ణుచిత్తులతో అదేమీ లేదనీ, అంతే కాకుండా ఇహ ప్రతిరోజూ తనకు గోదాదేవి ధరించిన మాలాధారణే కావాలని ఆదేశిస్తారు, దానితో విష్ణుచిత్తులవారు అలాగే చేస్తారు. తరువాత గోదా అమ్మవారు, తన తోటి బాలికలతో కలిసి “తిరుప్పావు” వ్రతాచరణ చేస్తారు. రోజు కొక పాశురముతో మార్గశీర్షస్నాన వ్రతము (ధనుర్ మాస వ్రతం). ఈ మాసమంతా ఆచరిస్తుంది.. శ్రీ రంగనాథునే వరించి ఆస్వామినే వివాహమాడి ఆయనలో ఐక్యమైపోతుంది.

ఆండాళ్ (గోదాదేవి) రోజుకొక పాశురముతో “తిరుప్పావై” అనే ద్రావిడ దివ్యప్రబంధమును మధురంగా పాడి సమర్పించింది. గోదాదేవి తన దివ్యప్రబంధమైన తిరుప్పావైలో ప్రతీ పాశురంలో నారాయణ తత్వాన్ని ప్రస్ఫుటీకరించింది. శ్రీకృష్ణ్ణునిపైగల ప్రపత్తిని చూపిస్తుంది. అంకితభావాన్ని తన పాశురంలలో తెలుపుతోంది. తాను తరించడమేకాక తన తోటి గోపికలనుకూడా మేల్కొల్పుతూ వారిని కూడా తరింపజేయడానికి పూనుకుంటుంది. లోక కల్యాణ హితమే ఈ పాశురాలలో కనబడుతోంది. శ్రీకృష్ణ్ణుని మనందరం కలసి ఆశ్రయించి తరిద్దాం రండి అని ప్రతిరోజూ ఒక్కో గోపికను నిద్రలేపుతుంది. భగవంతుని దర్శించేందుకు కొన్ని నియమాలు పాటిస్తారు. అలాంటి వ్రత నియమాలను తెలుపుతూ తరిద్దాం రండి అంటూ గోపికలతోపాటు భక్తులందరిని పిలుస్తుంది ఆండాళ్.వ్రతాచరణ సమయం ధనుర్మాసం లో ప్రతిరోజూ ఆలయంలో  పాశురం చొప్పున పఠిస్తారు.

తెలంగాణ ప్రభుత్వం భాషా, సాంస్కృతిక శాఖ సహకారంతో శ్రీ భూనీలా సమేత వేంకటేశ్వరస్వామి దేవాలయం, దేవాదాయ ధర్మాదాయ శాఖ,  వికాసతరంగిణి మీర్ పేట సౌజన్యంతో, శ్రీమతి వి. సువర్ణకుమారి సమర్పణలో జరిగిన  ఈ కార్యక్రమంలో శ్రీమతి ఈ. శశిరేఖ, ధార్మికోపన్యాసకురాలు, కర్పూరం గోపిధర్, దార్మికవేత్త, వింజమూరి విజయకుమార్ చార్యులు, వంశీకృష్ణ, అధ్యక్షులు, వికాస తరంగిణి, మీర్ పేట, హైదరాబాద్, జి. హరినాథ్, సమన్వయాధికారి, టి.టి.డి, హిందూధర్మ ప్రచార పరిషత్ తదితరులు పాల్గొని పాశురాల గాయకులను సత్కరించారు.

తిరుప్పావై పాశురాలు రూపంలో తయారుచేయించిన చిత్రమాలిక జ్ఞాపికను తిరుప్పావై గోష్ఠి గానం చేసిన వారందరికీ కండువాతో సత్కరించి అందించారు . జ్ఞాపికలను కర్పూరం గోపిధర్, దార్మికవేత్త, కె. గోపిధర్ శ్యంప్రియ దంపతులు అందచేశారు.

కార్యక్రమానికి ముందు వేదపాఠశాల విద్యార్థులచే వేదపఠనం, విష్ణు సహస్రనామాలు పారాయణం జరిగింది. వేదపాఠశాల విద్యార్థుల వేదపఠనం, విష్ణు సహస్రనామాలు పారాయణం ఆకట్టుకున్నాయి . హయగ్రీవ వేదపాఠశాల గురువు శ్రీమాన్ నందగోపాల్ గారిని కర్పూరం గోపిధర్  రూ.10,116 నగదును  అందచేసి  సత్కరించారు.

 

కె.ఎల్. నరసింహా రావు, జర్నలిస్ట్, కళావైభవం.కామ్ (సాంస్కృతిక సమాచార వెబ్ సైట్) వ్యవస్థాపకులు సమన్వయ, ప్రచార కర్తగా వ్యవహరించారు.

 

గోష్టిగానంలో పాల్గొన్నవారు:- శ్రీమతి ఎం. జయలక్ష్మి, శ్రీమతి పి. రాధాదేవి, శ్రీమతి కె. ఉమాదేవి, శ్రీమతి ఏ. వాణి, శ్రీమతి బి. రూపాదేవి, శ్రీ రాఘవాచార్యులు, శ్రీమతి డి. కృష్ణవేణి, శ్రీమతి జి. ఉమ, శ్రీమతి వి. సువర్ణకుమారి, శ్రీమతి టి.టి. వత్సల, శ్రీమతి కె. రాధ, చి. శ్రీమాన్, శ్రీమతి కె. వసంత, శ్రీమతి బి. కరుణ, శ్రీమతి శ్రీలత, శ్రీ కె. గోపిధార్, శ్రీమతి కె. గోపిధర్ శ్యంప్రియ, శ్రీమతి ఎం. కామేశ్వరి, శ్రీమతి బి. ఉష, శ్రీ టి. వంశీకృష్ణ, శ్రీమతి టి. భాను, శ్రీమతి వై.ఎన్. పాకజాలక్ష్మి, శ్రీ వై.ఎన్. నరసింహాచార్యులు, శ్రీమతి లీలావతి, శ్రీ రాజేందర్, శ్రీమతి కె. అరవింద భార్గవి, శ్రీమతి అరుణ. శ్రీ డి. రామాచారి మొదలైనవారు.

1f90a9b0-2665-4670-959c-d5467629f375 2cd21ffc-4a2b-4349-94b7-badbe0309dd2 2e0717d4-b4d0-4a37-b6e8-e2f09d44c1eb 3d08bbe1-ebc8-4ea8-be49-507549c8d9cd 5e42503a-c64a-47bc-b97d-2a13e2a308ab (1) 21fba79f-2c50-4aae-8789-eea359c8af83 75a395a3-9d80-4d75-a0ac-be0088314b9e 97c04e78-ea7c-4bcb-b1cd-b4df133d6325 914a3078-0ba6-424c-8dd3-10032fbf717c 4891b28e-364c-4300-90c0-692ce1dcc742 6228a881-09af-4943-94e8-53a0c35a368e 6699a44b-0f5e-4492-9367-f8212524d04d 42576d7d-d51a-43c8-b5b5-75697bd6288b 245541b2-6fd7-47c2-bf1f-902f27eb845d 9624572f-6e10-4136-b1a7-b106a16347bb a21dfa30-5446-4fb9-8488-b6031ae0a27b ab4f11db-c0fe-4129-a1bf-e507e467fcc6 ac7f277e-d0c6-4ab5-a436-a5fd24233432 c45aef19-8754-48f6-b02f-9d245302b6ea c959e47a-9824-46cb-969c-e073aa7ca84a cf2a105c-ee42-417e-a033-7ad72ce54cc1 d7f76a18-5bbf-4fb3-aa95-8dd5c2959a5c da35299f-d647-4256-b15d-1f0fbc8dad03 e6cd2afc-84e2-494e-b682-54ddeb479f08 e3784d34-d5a6-4f1e-b397-c9e12c4ba4cf f7a2c735-986f-4314-af6e-edacd6b387b9 IMG_20190105_174434283 IMG_20190105_180541725_BURST000_COVER_TOP IMG_20190105_180709971 IMG_20190105_182143994 IMG_20190105_182340943_BURST000_COVER_TOP IMG_20190105_183544872 IMG_20190105_183618559 IMG_20190105_201136583_BURST000_COVER_TOP IMG_20190105_201143591 IMG_20190105_201144909 IMG_20190105_201526339 IMG_20190105_202623498 IMG_20190105_202642045 IMG_20190105_202752978 IMG_20190105_203110406_BURST000_COVER_TOP IMG_20190105_203115671 IMG_20190105_203211958 Jjilleguda VS Temple Tirupavai Gaana Gosti Program 05.01.19 24x7onlinenews
<
>

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *