Top Bar Ad

Breaking News

త్వరలో హైద‌రాబాద్ లో వైట్ ట్యాపింగ్ రోడ్లు: కేటిఆర్

త్వరలో హైద‌రాబాద్ లో వైట్ ట్యాపింగ్ రోడ్లు: కేటిఆర్

హైద‌రాబాద్‌ ఆగష్టు 11 (ఎక్స్ ప్రెస్ న్యూస్ ):  హైద‌రాబాద్ రోడ్ డెవలెప్ మెంట్ కార్పోరేష‌న్ ద్వారా నగరంలోని సుమారు 200 కిలోమీటర్లకు పైగా రోడ్లను త్వరలో వైట్ ట్యాపింగ్ రోడ్లుగా మార్చనున్నట్లు మంత్రి కేటీఆర్ ప్రకటించారు. హైదరాబాద్ లో శుక్ర‌వారం నిర్వహించిన తెలంగాణ బిల్డర్స్ అసోసియేషన్ మూడవ వార్షికోత్సవ కార్య‌క్ర‌మానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో బిల్డర్స్ అసోసియేషన్ సభ్యులతోపాటు మేయర్ బొంతు రామ్మోహన్ పాల్గొన్నారు. రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ మంచి నీరు అందించ‌డం సహా ప్రభుత్వం చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి  కేటీఆర్ వివ‌రించారు. త్వరలో బిల్డర్లకు మద్దతుగా కాలుష్యం సహా పలు రకాల అనుమతులను సింగిల్ విండో పద్ధతిలోకి తీసుకురానున్నట్టు ప్రకటించారు. ఈ ఏడాది నవంబర్ చివరి నాటికి మెట్రో పనులు పూర్తి చేసి నాగోల్ నుంచి మియాపూర్ మెట్రో ప్రారంబిస్తామన్న ఆయన… నగరంలో కొత్తగా 4 స్కైవేల‌ను నిర్మించనున్న‌ట్లు ప్రకటించారు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *