Top Bar Ad

Breaking News

“బ‌స‌వేశ్వ‌రుడి ఆలోచ‌న‌లు సార్వ‌జ‌నీనం – సార్వ‌కాలికం” – సాంస్కృతిక, ప‌ర్యాట‌క, వ్య‌వ‌సాయ‌శాఖ‌ల ముఖ్య కార్య‌ద‌ర్శి సి. పార్థ‌సార‌థి

“బవేశ్వరుడి ఆలోచలు సార్వనీనంసార్వకాలికం” – సాంస్కృతిక, ప‌ర్యాట‌క, వ్య‌వ‌సాయ‌శాఖ‌ల ముఖ్య కార్య‌ద‌ర్శి సి. పార్థ‌సార‌థి

“స‌మస‌మాజ స్థాప‌న కోసం, మ‌హిళాభివృద్ధి కోసం, ప్ర‌జాస్వామ్య పాల‌న కోసం సిద్ధాంతాల‌ను రూపొందిచ‌డ‌మే కాక‌, వాటిని అమ‌లు చేసి, ఆచ‌రించి చూపిన గొప్ప సంఘ‌సంస్క‌ర్త‌, దార్శ‌నికుడు మ‌హాత్మ బ‌స‌వేశ్వ‌రుడు” అని సాంస్కృతిక, ప‌ర్యాట‌క, వ్య‌వ‌సాయ‌శాఖ‌ల ముఖ్య కార్య‌ద‌ర్శి సి. పార్థ‌సార‌థి  అన్నారు. మ‌హాత్మ బ‌స‌వేశ్వ‌ర జ‌యంతి  ఉత్స‌వాల‌లో భాగంగా ట్యాంక్ బండ్‌పై ఉన్న బ‌స‌వేశ్వ‌ర విగ్ర‌హానికి పూల‌మాల‌తో నివాళులు అర్పించిన ఆయ‌న, “ప్ర‌పంచంలోనే తొలిసారిగా అన్నివ‌ర్గాల ప్ర‌జ‌ల‌తో క‌లిసి అనుభ మండప” అనే పేరుతో పార్ల‌మెంట్‌ను ఏర్పాటు చేసాడ‌ని, కుల‌, మతాల‌కు అతీతంగా స‌హ‌పంక్తి భోజ‌నాల‌ను ప్రోత్స‌హించి స‌ర్వ‌స‌మాన స‌మాన‌త్వ భావ‌న‌ను ప్ర‌జ‌ల‌లో వ్యాప్తి చేసాడ‌ని, ఆనాటి స‌మాజంలోని దురాచారాల‌ను పార‌ద్రోల‌డానికి స్త్రీలు విద్య‌ని ఆర్జించ‌డం అవ‌స‌ర‌మ‌ని భావించాడని” బ‌స‌వేశ్వ‌రుడి స్ఫూర్తిని కొనియాడారు. క‌ర్నాట‌క‌లో జ‌న్మించిన‌ప్ప‌టికీ  బ‌స‌వేశ్వరుడి వచ‌నాలు, సిద్ధాంతాలు విశ్వ‌జ‌నీన‌మైన‌వ‌ని, అవి నేటికీ ఆచ‌ర‌ణ యోగ్య‌మైన‌వ‌ని గుర్తు చేశారు. అలాంటి మ‌హ‌నీయుని జ‌యంతి వేడుక‌ల‌ను తెలంగాణ ప్ర‌భుత్వం అధికారికంగా గ‌త నాలుగేళ్ళుగా నిర్వ‌హిస్తూ రావ‌డం అభినంద‌నీయ‌మ‌ని, బ‌స‌వేశ్వ‌రుని ఆశ‌యాలు సాధించ‌డానికి మ‌నం కంక‌ణ‌బ‌ద్ధులం కావాల‌ని పిలుపునిచ్చారు.

అత్యంత వైభ‌వంగా జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మంలో సి. పార్థిసార‌థి IAS గారితోపాటు, బ‌ల‌హీన‌వ‌ర్గాల గురుకులాల సంస్థ సెక్ర‌ట‌రీ మ‌ల్ల‌య్య భ‌ట్టుగారు, MBC కార్పోరేష‌న్ ఎం.డి.  అలోక్ కుమార్ గారు, శ్రీ సైదా గారు, సాంస్కృతిక శాఖ సంచాల‌కులు మామిడి హ‌రికృష్ణ గారు పాల్గొని బ‌స‌వేశ్వ‌రుడి విగ్ర‌హానికి           పూల‌మాల‌ల‌తో నీరాజ‌నాలర్పించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *