Top Bar Ad

Breaking News

త్యాగరాయగానసభ: తెలుగురథం నిర్వహణలో ఘనంగా రచయిత్రి ఇల్లిందల సరస్వతీదేవి శతజయంతి

 తెలుగురథం నిర్వహణలో ఘనంగా రచయిత్రి ఇల్లిందల సరస్వతీదేవి శతజయంతి

తెలుగురథం నిర్వహణలో – ప్రముఖ రచయిత్రి, సంఘసేవిక ఇల్లిందల సరస్వతీదెవి గారి “శతజయంతి” సమాపన సభ సందర్భంగా – నిర్వహించిన “సారస్వత సమాలొచనం” సభలో – ప్రముఖ సాహితీ విశ్లేషకురాలు డా.ముక్తేవి భారతి, రచయిత్రి, ఆధ్యాత్మిక రచయిత్రి,విమర్శకురాలు డా.పులిగడ్డ విజయలక్ష్మి విశిష్త అతిథులుగా పాల్గొని – ఇల్లిందల సరస్వతీదేవి గారి సాహిత్య సమాజసేవా ప్రస్థానంలోని పలు అంశాలను ప్రస్తావిస్తూ, వీరితొ వారి జీవనపర్వంలో కలిగిన ప్రత్యక్ష సన్నివేశ సన్నిహిత సంఘటలనని, సన్నివేశాల గురించి సోదాహరణ ప్రసంగం చేశారు.

 

శ్రీ త్యాగరాయ గానసభలోని కళా లలిత కళా వేదికపై జరిగిన ఈ సారస్వత సభలో – ఇల్లిందల సరస్వతీదెవి గారి సంతానం – శ్రీ ఇల్లిందల నాగనాథ్ (తనయుడు) మరియు శ్రీమతి సుజాత (తనయ) మరియు ఆంధ్ర యువతీ మండలి కార్య నిర్వాహక మండలి సభ్యురాలు శ్రీమతి పద్మ సభలో ఆత్మీయ అతిథులుగా విచ్చేసి, తన అనుభవానుభూతులను ప్రస్తావించారు.

ఈ సందర్భంగా – తెలుగురథం పక్షాన, శ్రీ త్యాగరాయ గానసభ అధ్యక్షులు శ్రీ కళా వేంకట జనార్దన మూర్తిగారు ఆత్మీయ అతిథిగా విచ్చేసి, అతిథులకు ఆత్మీయ సత్కారం చేశారు.

సారస్వత సభకు ముందుగా ఏర్పాటు చేసిన – సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా – శ్రీమతి ఉష ఈమని గారు – వివిధ వాగ్గేయకారుల కీర్తనలని తమ “సంగీత కదంబం” అందించగా, లయవిన్యాస సహకారాన్ని శ్రీ సంజయ్ ప్రతిభవంతంగా నిర్వహించి, సంగీత కదంబ సభకు పలు సొగసులను, సొబగులను అందించిన వైనం అందరినీ ఆహ్లాదపరచింది.

కొంపెల్ల శర్మ, అధ్యక్షులు, తెలుగురథం – సభా సమన్వయంతొ నిర్వహించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *