తెలంగాణ ఐటీ అసోసియేషన్ ఆధ్వర్యంలో30న తెలంగాణ నిర్మాణ్ సదస్సు
హైదరాబాద్ డిసెంబర్ 29: కార్పొరేట్ రంగంలో ఉద్యోగాలు పొందేందుకు కావాల్సిన సాఫ్ట్ స్కిల్స్, సంబంధిత నైపుణ్యాలపై అవగాహన కల్పించేందుకు తెలంగాణ ఐటీ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ నిర్మాణ్ పేరుతో శనివారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నారు. కూకట్‌పల్లిలోని జేఎన్టీయూహెచ్లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ సదస్సు ఉంటుందని టీటా వ్యవస్థాపక అధ్యక్షుడు సందీప్‌కుమార్ మక్తాల తెలిపారు. సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ మీడియా, ఈఆర్పీ, క్లౌడ్ కంప్యూటింగ్, సోలార్ ఎనర్జీ, మొబైల్ అప్లికేషన్ డెవలప్మెంట్ వంటి నైపుణ్యాలతోపాటు ఇంటర్వ్యూ, కమ్యూనికేషన్, మోటివేషన్, గోల్ సెట్టింగ్ వంటి అంశాలపై వ్యక్తిత్వ వికాస నిపుణులతో దాదాపు 1200 మందికి శిక్షణ ఇప్పించనున్నట్టు ఒక ప్రకటనలో ఆయన వివరించారు. విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించాలనుకుంటున్న యువతకు ప్రత్యేక సెషన్లు ఏర్పాటు చేసినట్టు సందీప్ కుమార్ మక్తాల తెలిపారు.