Top Bar Ad

Breaking News

తెలంగాణ జాగృతి న్యూజీలాండ్ ఆక్లాండ్ లో జరిగిన మహా బతుకమ్మ సంబరాలలో మన తెలంగాణ సంప్రదాయంలో అతిథులకు స్వాగత సత్కారాలు, సన్మానాలు ఘనంగా జరిగాయి -24-Sep-17

తెలంగాణ జాగృతి న్యూజీలాండ్ ఆక్లాండ్ లో జరిగిన మహా బతుకమ్మ సంబరాలలో మన తెలంగాణ సంప్రదాయంలో అతిథులకు స్వాగత సత్కారాలు, సన్మానాలు ఘనంగా జరిగాయి -24-Sep-17

తెలంగాణ జాగృతి న్యూజీలాండ్ మహా బతుకమ్మ సంబరాలు ఆక్లాండ్ లో ఘనంగా జరుపుకున్నారు. సుమారు 500 మందికి పైగా ఈ సంబరాలలో పాల్గొన్నారు.

తెలంగాణ కు మాత్రమే ప్రత్యేకమైన ఈ పూల పండగలో, ఇతర రాష్ట్ర ప్రజలు, చైనీస్ మరియు కివీస్ (newzealanders) కూడా పాలు పంచుకున్నారు. మహిళలు, పిల్లలు, పెద్దలు అందరు ఉత్సాహంగా బతుకమ్మ ఆటపాటలతో ఆడారు. కోలాటం ప్రత్యేక ఆకర్షణగ నిలిచింది. దాదాపు 5 గంటలు విరామం లేకుండా బతుకమ్మ ఆటలు ఉత్సాహముగా ఆడారు.

TJNZ మొదటి బతుకమ్మ సంబరాలు అంబరాన్ని తాకేలా జరిగాయి. TJNZ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారికి తమ ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మన్దీప్ కౌర్ NZ police department , శ్రీమతి నీలిమ గారు, శాంతి నివాస్ చారిటబుల్ ట్రస్ట్, శ్రీ జీత్ గారు భారతీయ చారిటబుల్ ట్రస్ట్ పాల్గొన్నారు.

అంతటా పండగ వాతావరణం, ఆనందం, కోలాటం, బతుకమ్మ ఆటలు, పాటలు, చక్కటి భోజనం, ఆప్యాయతలు, అనురాగాలు, ఆత్మీయులు అంతా పండగే, అంతటా ఆనందమే. బతుకమ్మ పాటలు, అందమైన బతుకమ్మలు, అందమైన సాంప్రదాయ వస్త్రధారణ వంటి ఎన్నో అంశాలలో పోటీలు నిర్వహించి విజేతలకు అందమైన చేనేత చీరలు మరెన్నో అందమైన బహుమతులు అందచేశారు.

మన బంగారు బతుకమ్మను మల్లి ఏడాదికి రమ్మని ఆహ్వానిస్తూ మహిళలు సాగనంపారు.

ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి తెలంగాణ జాగృతి న్యూజీలాండ్ అధ్యక్షురాలు శ్రీమతి అరుణ జ్యోతి గారు ధన్యవాదాలు తెలిపారు.

TJNZ మన తెలంగాణ సంప్రదాయంలో అతిథులకు స్వాగత సత్కారాలు, సన్మానాలు ఘనంగా జరిపారు. ఈ సంబరాల్లో TJNZ ఆత్మీయులు, శ్రీమతి వర్ష రెడ్డి పట్లోళ్ల, శ్రీ రామ్ యాదవ్ బిజ్జు, శ్రీ రాజవర్ధన్ రెడ్డి, శ్రీమతి శీతల అల్లం, శ్రీ రాఘవేంద్ర కట్టెల, శ్రీమతి ప్రసన్న గుమ్ముడవెల్లి, శ్రీమతి కవిత మన్నెం, శ్రీమతి శ్రీలత అల్లే, శ్రీమతి విజయలక్ష్మి ముమ్మడి, శ్రీమతి శ్వేతా పట్లోళ్ల, శ్రీమతి నిర్మల మోహన్, శ్రీమతి సరితా విక్రమ్, శ్రీమతి సంధ్య జగన్, శ్రీ అయ్యుబ్ ఖాన్, శ్రీ విజయ్ సిరిసిల్ల, శ్రీ సోమేశ్ బండ్ల, తెలుగు అసోసియేషన్ అఫ్ న్యూజీలాండ్ అధ్యక్షులు శ్రీ ధర్మేందర్ అల్లే గారు, తెలంగాణ అసోసియేషన్ అఫ్ న్యూజీలాండ్ అధ్యక్షులు శ్రీ కళ్యాణ్ కాసుగంటి గారు, తెరాస న్యూజీలాండ్ అధ్యక్షులు శ్రీ విజయ్ కోసన గారు తదితరులు పాల్గొన్నారు

Presentation1 22007655_514434585568336_2917523106208013058_n 21768262_514434692234992_7079021405157210571_n 22046754_514435272234934_5864516554440098900_n 22045813_514434725568322_5602931322102460156_n 21764916_514434485568346_3391131325527925147_n 21765026_514434508901677_4242722160061787063_n 21765061_514435138901614_1226201772872722165_n 21765239_514434855568309_7274859984475463594_n 21765283_514434728901655_144113242160779076_n 21766297_514434865568308_2963839447531461942_n 21766544_514434992234962_1174695854307414030_n 21768252_514435275568267_4196928972059692541_n 21768465_514434968901631_6715828209830143177_n 22007316_514434788901649_2691372292526508285_n 22007935_514434735568321_1116787712279011952_n 22007958_514435115568283_1550728761571405025_n 22008131_514435005568294_3579139398488149569_n 22046497_514435098901618_6721014480885042080_n 22046722_514434848901643_5176302976345814199_n 22046738_514435268901601_5034742361075923022_n 21764916_514434485568346_3391131325527925147_n
<
>

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *