ఫిలిం హబ్ గా హైదరాబాద్: భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ
భాషా సాంస్కృతిక శాఖ ప్రతి ఆదివారం నిర్వహిస్తున్న ‘సండే సినిమా’ (ఎ విండో టూ వరల్డ్ సినిమా)లోఈరోజు … ఆకట్టుకున్న “లోలా” (ఫిలిప్పీన్స్) చిత్ర ప్రదర్శన
చిత్ర ప్రదర్శన తర్వాత, మిచిగాన్ యూనివర్సిటీలోని స్క్రీన్ ఆర్ట్స్ అండ్ కల్చర్ విభాగంలో హిస్టరీ ఆఫ్ ఫిల్మ్ థియరీ అండ్ క్రిటిసిజం అనే అంశంపై పిహెచ్.డి చేసి, అన్నపూర్ణ ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియా వారి లైబ్రరీ ఆర్ట్స్ కన్సల్టెంట్ ఫ్యాకల్టీ మెంబర్ గా ఉన్న ‘ఫిరోజ్ హసన్’ గారితో చిత్ర విశ్లేషణ, ముఖాముఖి చర్చ జరిగింది.
భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ గారు ఫిరోజ్ హసన్ గారిని సత్కరించి, జ్ఞాపికను అందజేశారు.
ఈ సందర్భంగా హరికృష్ణ గారు మాట్లాడుతూ… తెలుగు సినిమా మూస ఫార్మాట్ వల్ల సినిమా అంటేనే ఎంటర్టైన్మెంట్, మెలో డ్రామా, టైంపాస్ అనే విధంగా మారిపోయిందని, సినిమాని ఒక విజువల్ ఆర్ట్ ఫార్మ్ (Art Form) ఎవరు చూడడం లేదన్నారు. సినిమా యొక్క ఉద్దేశ్యంను తెలియజేస్తూ, ప్రపంచస్థాయి క్లాసిక్ సినిమాలు యంగ్ జెనరేషన్ ఆడియన్స్ కి చూపించాలనే లక్ష్యంతో ఈ సండే సినిమాను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. సకల క్రాఫ్ట్స్ సమ్మేళనమైన సినిమా మేకింగ్ లో చాలా టీం వర్క్ ఉంటుందని, అన్ని క్రాఫ్ట్స్ సరిగ్గా అమరితేనే సినిమా అద్భుతంగా వస్తుందన్నారు. ప్రస్తుతం హైదరాబాదు ఫిలిం హబ్ గా తయారయిందని, ఇదివరకట్లా సినిమాల కోసం మద్రాసుకో, ముంబైకో వెళ్ళవలసిన అవసరం లేదని ఫిలిం మేకింగ్, ఫిలిం లెర్నింగ్, ఫిలిం యాక్టింగ్ వంటి అన్నిరకాల కోర్సులు హైదరాబాదులోనే ఉన్నాయని, ముంబైతో పోల్చుకుంటే మన హైదరాబాదులోనే ఎక్కువ ఫిలిం ఇని స్టిట్యూట్ లు ఉన్నాయన్నారు. సినిమా ఒక విజువల్ బుక్ అని, సినిమా చూసే విధానాన్ని విస్తృతంగా మెరుగుపరుచుకొని విశ్లేషించుకునేలా యంగ్ ఫిలిం మేకర్స్ తయారవ్వాలని, సినిమాల పై పరిశోధనలు చేసిన ఫిరోజ్ హాసన్ లాంటి వారి వల్లనే సినిమాను ఎడ్యుకేషన్ గా తీసుకునే అవకాశం వస్తుందని తెలుపుతూ, ‘లోలా’ సినిమా గురించి క్యూరేట్ చేయడానికి వచ్చిన ఫిరోజ్ హాసన్ కు ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ కార్యక్రమానికి క్యూరేటర్ గా విచ్చేసిన ఫిరోజ్ హసన్ గారు మాట్లాడుతూ… తెలుగు సినిమా ప్రేమికులుకు ప్రపంచ సినిమాలను చూపించడంకోసం ఇంత గొప్ప వేదికను అందించిన భాషా సాంస్కృతిక శాఖకు మరియు యంగ్ ఫిలిం మేకర్స్ ను ప్రోత్సహిస్తున్న సంచాలకులు మామిడి హరికృష్ణ గారికి అభినందనలు తెలిపారు. “లోలా” చిత్ర నేపథ్యాన్ని, పాత్రల స్వభావాన్ని, వాటిలోని అంతర్గత భావాల గురించి వివిధ కోణాలనుంచి విశ్లేషణ చేసిన అనంతరం సినీ ప్రేమికులతో జరిగిన ముఖాముఖిలో పాల్గొన్నారు.
“లోలా” బ్రిల్లాంట్ మెన్డోజా దర్శకత్వం వహించిన ఫ్రెంచ్-ఫిలిపినో చిత్రం. తమ మనవళ్ళ వల్ల ఇద్దరు వృద్ద మహిళలు ఎదుర్కున్న పరిణామల ఇతివృత్తంతో 2009లో విడుదలైన ఈ చిత్రం 66వ వెనిస్ ఫిలిం ఫెస్టివల్ ప్రధాన పోటీకి అర్హత సాధించింది.
https://www.facebook.com/SundayCinema.rb/videos/800406540163768/
Lola (Grandmother)
Lola (Grandmother) is a 2009 French-Filipino independent drama film directed by Brillante Mendoza. It was entered into the main competition at the 66th edition of the Venice Film Festival.
Two elderly women bear the consequences of a crime involving their respective grandsons. One is the victim, the other is the suspect. Both weak and poor, they laboriously solicit money in the midst of a storm, one for the victim’s burial, the other for the suspect’s bail bond.
Curator: Feroz Hassan (consultant faculty member of Liberal Arts at the Annapurna International School of Film and Media. He holds a PhD in Screen Arts and Cultures from the University of Michigan, and his research area is the history of film theory and criticism)