Top Bar Ad

Breaking News

నిర్మల్ పట్టణం కాలువ గ్రామంలో ఈ రోజు ( 18.05.2019 )న ఘనంగా శ్రీ లక్ష్మి నరసింహా స్వామి కళ్యాణం

నిర్మల్ పట్టణం కాలువ గ్రామంలో ఈ రోజు ( 18.05.2019 )న ఘనంగా శ్రీ లక్ష్మి నరసింహా స్వామి కళ్యాణం

తెలంగాణ రాష్ట్రం లోని నిర్మల్ పట్టణం దగ్గరలో కాలువ గ్రామంలో ఈ రోజు ( 18.05.2019 ) వైశాఖ పౌర్ణమి రోజున శ్రీ లక్ష్మి నరసింహా స్వామి కళ్యాణం ఘనంగా జరిగింది. ఈ ఆలయం విశిష్టత చాలా ప్రాచీనమైనది. 13 వ శతాబ్దం లో కాకతీయ రాజుల కాలం లో వెలసిన ఈ క్షేత్రం భక్తుల పాలిట కొంగు బంగారం.

నిన్న నరసింహా జయంతి కూడా చాలా ఘనంగా జరుపుకొన్నారు. ఈ రోజు జరిగిన శ్రీ లక్ష్మి నరసింహా స్వామి కళ్యాణం సందర్బంగా వేల మంది భక్తులతో ఆలయం కిట కిట లాడింది. పక్క రాష్ట్రాల నుండి కూడా భక్తులు వచ్చారు. వేద పండితులు మరియు ఈ ఆలయ పురోహితుడు అయిన యజ్ఞాచర్య శర్మ గారు మరియు వారి తండ్రి గారు, సీను పంతులు గారు, ఇతర పూజరుల సమక్షం లో అత్యంత వైభవంగా ఈ కల్యాణం జరిగింది.

ఈ వేడుక లో తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వారు శ్రీ ఇంద్ర కరణ్ రెడ్డి శ్రీమతి మరియు బీజేపీ తెలంగాణ రాష్ట్ర బేటీ బచావో బేటీ పడావో కన్వీనర్ శ్రీమతి గీతా మూర్తి, ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు, ఆలయ సిబ్బంది శ్రీనివాస్, మాధవ్ రావు, ఆధ్యాత్మిక వేత్త భీంసేన్ మూర్తి ,నిర్మల్ పట్టణ సర్కిల్ ఇన్ స్పెక్టర్ మొదలగు వారు విశిష్ట అతిథులుగా పాల్గొని ఆ స్వామి వారి ఆశీస్సులు పొందారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *