(Shilparamam – Madhapur 06.07.19)
శిల్పారామం మరియు సూర్-ఓ-ధ్వని సంయుక్త నిర్వహణలో ఆకట్టుకున్న బెంగాలీ సంస్కృతి సంప్రదాయాలతో ” బొంగొ మేళ 2019 “
శిల్పారామం మరియు సూర్-ఓ-ధ్వని సంయుక్త నిర్వహణలో భాగంగా శిల్పరామం ఆవరణలో బెంగాలీ సంస్కృతి సంప్రదాయాలతో ” బొంగొ మేళ 2019 ” ని నిర్వహించడం జరిగింది. ఈ రెండు రోజుల ఉత్సవానికి హైదరాబాద్ లో నివసిస్తున్న బెంగాలీలు విచ్చేసారు.
బెంగాలీ కాటన్ చీరలు, లెనిన్ చీరలు, ఆర్టిఫిషల్ జ్యూవెలరీ, పెయింటింగ్స్ మొదలగునవి శాంతినేకేతన్ నుండి వచ్చాయి. కొలకత్తా కాతి రోల్స్, చాప్, మిష్టి దోయి, రసగుల్ల, కాలాజామూన్ మొదలైన బెంగాలీ స్వీట్స్ ఎంతగానో ఆకట్టుకొన్నాయి.
రవీంద్ర సంగీత్, బెంగాలి పాటలు, హిందుస్తానీ మ్యూజిక్, సాక్సోఫోన్, హార్మోనియం, బెంగాలీ బ్యాండ్, హిందోల్ డాన్స్ గ్రూప్, రవీంద్ర నృత్యాలు, జానపద నృత్యాలు మొదలైన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.
ప్రతి సంవత్సరం వివిధ రాష్ట్రాలకి చెందిన అసోసియేషన్స్ లను పిలచి వారి సాంస్కృతిక సాంప్రదాయాలను, ఆర్ట్స్, క్రాఫ్ట్స్, డాన్స్, మ్యూజిక్, వంటలను హైదరాబాద్ ప్రజలందరికి శిల్పారామం పరిచయం చేస్తూనేవుంది.
ఆయా రాష్ట్రాల ప్రజలు, ఔత్సాహికులు అందరూ పాల్గొని కార్యక్రమాలను జయప్రదం చేస్తున్నారు. బెంగాలీలు వారి సాంప్రదాయ వస్త్రాలలో ఈ ఉత్సవంలో పాల్గొన్నారు.