Top Bar Ad

Breaking News

శిల్పారామం ఆంఫీ థియేటర్: వారాంతపు సాంస్కృతిక కార్యక్రామలలో భాగంగా అలరించిన కూచిపూడి, భరతనాట్య ప్రదర్శనలు 14-April-2018

వారాంతపు సాంస్కృతిక కార్యక్రామలలో భాగంగా అలరించిన కూచిపూడి, భరతనాట్య ప్రదర్శనలు

వారాంతపు సాంస్కృతిక కార్యక్రామలలో భాగంగా శిల్పారామం లోని ఆంఫీ థియేటర్ లో కూచిపూడి, భరతనాట్య ప్రదర్శనలు ఎంతగానో అలరించాయి.

సుమధుర ఆర్ట్స్ అకాడమి కుమారి శ్రవ్యమానస నేతృత్వంలో కూచిపూడి నృత్య ప్రదర్శన ఎంతగానో అలరించింది. గణేషకాంతం, పలుకేబంగారమయ్యే, థిల్లాన, శంభో శివ, భూ:శంభో, నారాయణతే నమో నమో మొదలైన అంశాలను ప్రదర్శించారు. కళాకారులు జ్యోతి, అనన్య, దీక్షిత, మేఘన, నక్షత్ర, శ్రావ్య, రిషిత, చిన్మయి, తేజస్విని మొదలైనవారు పాల్గొన్నారు.

 

 

నృత్యోపచార శ్రీమతి వడపల్లి ప్రవీణ తన శిష్య బృందంతో భరతనాట్య ప్రదర్శన ఇచ్చినారు. నాథతను మనిషం, పుష్పాంజలి, నటేశకాంతమ్, క్షీరసాగర శయన, చిక్కవనే ఇవనో, రామచంద్రుడితడు, అర్ధనారీశ్వరం అంశాలను శ్రీమతి వాడవల్లి ప్రవీణ, అనీఘ పురుషోత్తం, అనన్య పురుషోత్తం, శ్రేయ కల్లూరీలు ప్రదర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *