Top Bar Ad

Breaking News

శిల్పారామం: ఆకట్టుకున్న కథక్, కూచిపూడి మరియు జానపద నృత్య ప్రదర్శనలు – 8-April-2018

ఆకట్టుకున్న కథక్, కూచిపూడి మరియు జానపద నృత్య ప్రదర్శనలు

  ఆదివారం సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా శిల్పారామంలో కథక్, కూచిపూడి మరియు జానపద నృత్యాలు ఎంతగానో అలరించాయి.

ప్రముఖ కథక్ కళాకారిణి కుమారి గరిమ ఆర్య న్యూ ఢిల్లీ గారిచే కథక్ ప్రదర్శన ఆద్యంతం ఆకట్టుకొంది. ” కథక్ యాత్ర ” కథక్ డాన్స్ ప్రయాణం దేవాలయాల నుండి ఈ నాటి స్టేజి షోల వరకు ఎలా రూపాంతరం చెందిందో అంశం పై మరియు మొఘలుల సామ్రాజ్యంలో కథక్ నృత్యం ప్రాధాన్యత, ఈ కాలంలో కథక్ నృత్యాల ప్రాధాన్యం అంశంగా కుమారి గరిమ ఆర్య కథ రూపంగా నృత్యాన్ని ప్రదానాశంగా తీసుకొని నర్తించారు.

శ్రీ పార్వతి పరమేశ్వర సంగీత నృత్యాలయం శ్రీమతి నాగలక్ష్మి గారి నేతృత్వంలో వారి శిష్య బృందం కూచిపూడి మరియు జానపద నృత్యంశాలలో ప్రదర్శనలు ఇచ్చారు. ఉమామహేశ్వర తాండవం, ఏకదంతాయ, అష్టలక్ష్మి వైభవం, దశావతారాలు, శ్రీనివాసుని కళ్యాణం, అలరులు గురియగ, మూషిక వాహన, అష్టపది, చందాన చర్చిత, నాగిని నృత్యం, ఘల్లు ఘల్లు, ఏరువాక సాగారో, గున్నమామిడి అంశాలను ప్రదర్శించారు.

కళాకారులు హరిత, భరణి, వైష్ణవి, రహీన, అథితి, శ్రీనిధి, అన్నపూర్ణ, దివ్య మొదలగువారు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *