Top Bar Ad

Breaking News

శిల్పారామం: ఘనంగా ప్రారంభమైన “ లలిత పదన్యాసం- The beauty of Kuchipudi” పేరుతో నాట్యోత్సవాలు 3-Dec-17

ఘనంగా ప్రారంభమైన “ లలిత పదన్యాసం- The beauty of Kuchipudi” పేరుతో నాట్యోత్సవాలు 

శిల్పారామం మరియు అంతర్జాతీయ నాట్య పరిశోధన మరియు శిక్షణా సంస్థ (IDRTC) కూచిపూడి వారి సంయుక్త నిర్వహణలో, “ లలిత పదన్యాసం- The beauty of Kuchipudi” అనే పేరుతో ఆదివారం శిల్పారామం ఆంపీ థియేటర్ లో, ప్రఖ్యాత నాట్యవిద్వాంసులు కళారత్న వెంపటి రవిశంకర్ గారు మరియు డా. పసుమర్తి వెంకటేశ్వర శర్మ గారు, IDRTC డైరెక్టరు గారు జ్యోతి ప్రజ్వలన చేసి, నాట్యోత్సవాలకు నాంది పలికారు.

శ్రీ వెంపటి రవిశంకర్ గారి శిష్యులు కుమారి సాయి నీహారిక, కుమారి నీనా చెరియన్, కుమారి ఝాన్సీరాణి నారాయణీయం, వెడలిన వయ్యారులు అంశాలను ప్రదర్శించారు.

డా. చింతా రవిబాలకృష్ణ గారి శిష్యులు కుమారి లాస్యప్రణవి ప్రణవాకారం సిద్ధివినాయకం, థిల్లాన అంశాలను ప్రదర్శించారు.

శ్రీ వేదాంతం సత్య నృసింహ గారి శిష్యులు కుమారి గోపి లిఖిత వచ్చెను అలివేలు మంగ, దేవదేవం భజే అంశాలను ప్రదర్శించారు.

శ్రీమతి పి.బి.క్రిష్ణభారతి గారి శిష్యులు పి.బి. వైష్ణవి ఒకపరికొకపరి, మధువంతి థిల్లాన అంశాలను ప్రదర్శించారు.

శ్రీ సుధీర్ రావు గారి శిష్యురాలు కుమారి హర్షిణీ భూపతిరాజు మహేశ్వరీ మహంకాళి భుఃశంభో అంశాలను ప్రదర్శించారు.

చివరగా పద్మభూషణ్ డా. వెంపటి చినసత్యం గారు నృత్య దర్శకత్వం వహించిన “ పూజా నృత్యాని” అందరి గురువుల శిష్యులు ప్రదర్శించటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

గురువులను, వారి శిష్యులను జ్ఞాపిక మరియు ప్రశంసాపత్రాలు శాలువాతో IDRTC డైరెక్టరు గారు ఘనంగా సత్కరించారు.

 

English Version:

Shilparamam & International Dance Research & Training Centre Kuchipudi Jointly Presents “Lalitha Padanysam”   the Beauty of Kuchipudi Dance Festival in Shilparamam Amphitheatre.

Kalaratna Sri Vempati Ravi Shanker garu & Dr. Pasumarthy Venkateshwara Sharma & IDRTC Director Sri Tadepalli Garu lighted the lamp and stated the Dance Festival.

Guru Sri Vemapti Ravi Shanker   Students  Kum Sai Nihantri,  Kum Neena Cherian & Kum Jhansi Rani  Performed the items Narayaneeyam and Vedeley Vayyarulu

Guru Dr. Chintha Ravi Balakrishna  Student um Laays Pranathi Performed the items Pranavakaram Siddivinayakam, Thillana.

Guru Sri Vedantham Satya  Nrusimha Shastry Student  Kum Gopi Likhitha performed  the items Vachenu Aluvelu manga, Deva devam Bhajy

 Guru Smt. PB Krishna Bharathi Student Kum PB Vaishnavi  Performed  the items okapari kokapari, Madhuvanthi thillana

Guru Sri Sudheer Rao garu student kum Harshini Bhupathi Raju Performed the items maheshwari Mahankali & Bhu Shambho..

 As a last piece All the dancers performed “pooja Nrutyam” which Dance Directed by Padmabhushan Dr. Vempati China Satyam.

 IDRTC Director Felicitated all the artists & Gurus Grandly

 

Feature Image Card Inner 3 copy(2) Card Outer 1 copy resized_IMG_6580 resized_IMG_6602 resized_IMG_6615 resized_IMG_6626 resized_IMG_6630 resized_IMG_6633
<
>

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *