Top Bar Ad

Breaking News

*** 24x7onlinenews.com(30-May): Union Ministry of Home Affairs (MHA) issued New Guidelines to fight COVID-19 to be effective from 1st June 2020 ***

శిల్పారామం: ఘనంగా రెండు రోజుల “ గురు ప్రణామ్” నృత్యోత్సవాలు ప్రారంభం 14-Oct-17

శిల్పారామం: ఘనంగా రెండు రోజుల “ గురు ప్రణామ్” నృత్యోత్సవాలు ప్రారంభం 14-Oct-17

నృత్యకుంజ్ అకాడమీ ఆఫ్ కథక్ డాన్స్ మరియు శిల్పారామం సంయుక్తంగా నిర్వహించు “ గురు ప్రణామ్” నృత్యోత్సవాలను శ్రీమతి ఆర్తి శంకర్ గారి పర్యవేక్షణలో ఘనంగా రెండు రోజుల ఉత్సవాలను శ్రీ పండిత్ రాజేంద్ర కుమార్ గంగానీ ప్రముఖ కథక్ నృత్య విద్వాంసులు మరియు శ్రీ కళాకృష్ణ ప్రముఖ నృత్య కళాకారులు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.

ప్రముఖ కథక్ విద్వాంసులు కథక్ కేంద్ర న్యూఢిల్లీలో ఎంతో మంది కథక్ కళాకారులను తీర్చిదిద్దిన కీ.శే. కుందన్ లాల్ గంగానీ గారికి గురుప్రణామములు సమర్పించుచున్న ఈ రెండు రోజుల ఉత్సవాలకు శ్రీమతి ఆర్తి శంకర్ గారి శిష్య బృందంచే కథక్ నృత్య ప్రదర్శన ఎంతగానో అలరించింది.

గురుభజన్, జపతాళ్, సరగం, తరాణ, తీన్ తాళ, తీన్ తాళ మధ్యాలయ, అంశాలను కేతకి, అక్షిత, మనీషా, సహన, ఆరుషి, తన్వి, కావ్య మొదలైనవారు శ్రీమతి ఆర్తి శంకర్ గారి శిక్షణలో నేర్చుకొని గురువందన సమర్పించారు.

<
>

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *