శిల్పారామం: పచ్చని మైదానంలో బతుకమ్మ ఆట, శిల్పసీమలో తోలు బొమ్మలు, శాస్త్రీయ జానపద నృత్యాలు, రోడ్ షోలు, గిరిజన నృత్యాలు, చేనేత హస్తకళల ప్రదర్శన, ప్రకృతి అందాలతో ఇంకో ప్రపంచములో విహరించేలా ముస్తాబై సందర్శకులతో కళకళలాడిన శిల్పారామం
అఖిల భారత చీరల మేళా, బతుకమ్మ మరియు దసరా ఉత్సవాల సందర్భంగా శిల్పారామం లో గత ఐదు రోజుల నుండీ ఉత్సవ వాతావరణం నెలకొన్నది. పచ్చని మైదానంలో బతుకమ్మ ఆట, శిల్పసీమలో తోలు బొమ్మలు, ఆంపీథియేటర్ లో శాస్త్రీయ జానపద నృత్యాలు, రోడ్ షోలు, గిరిజన నృత్యాలు, వివిధ రాష్ట్రాల నుండి విచ్చేసిన చేనేత హస్తకళల ప్రదర్శన స్టాల్స్, పచ్చని వాతావరణములో జలపాతాలు జిగేలుమనే వెలుతురులో ప్రకృతి అందాలతో ఇంకో ప్రపంచములో విహరించేలా ముస్తాబైన శిల్పారామం సందర్శకులతో కళకళలాడుతోంది.
గొల్లభామ, గద్వాల్, పోచంపల్లి, బెంగళూరు సిల్క్ చీరలు, బాల్ చూరీ వెస్ట్ బెంగాల్ చీరలు, టస్సర్ బగల్పూర్ చీరలు, మహిళలను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.
కథక్ నృత్యప్రదర్శన & సంజయ్ జోషీ బృందము, తప్పెటగుళ్ళు శ్రీ సత్తిరాజు బృందము, డోలుకుణిత శ్రీ టకప్ప బృందము, ఎంపి గాంగౌర్ నృత్యం శ్రీ విశాల్ బృందం, గౌర్ మాడియా శ్రీ శ్రవణ్ బృందం, భరత నాట్యం శ్రీమతి సుమా రాజేష్, ‘విజయదశమి’ నృత్యరూపకం శ్రీ రవి బృందం ప్రదర్శనలు ఎంతగానో ఆకట్టుకున్నాయి.