Top Bar Ad

Breaking News

*** 24x7onlinenews.com(30-May): Union Ministry of Home Affairs (MHA) issued New Guidelines to fight COVID-19 to be effective from 1st June 2020 ***

రవీంద్రభారతి: ఏనుగు నరసింహా రెడ్డి రచించిన ‘మూలమలుపు ‘ కవితా సంపుటి ఆవిష్కరణ 14-June-18

ఏనుగు నరసింహా రెడ్డి రచించిన ‘మూలమలుపు ‘ కవితా సంపుటి ఆవిష్కరణ

జీవితంలోని మలుపులను, కార్యభారం కార్యాచరణకు భారం కాదని రచయత నరసింహారెడ్డి సున్నితంగా అక్షరీకరించాడని తెలుగు విశ్వవిద్యాలం ఉపకులపతి ఆచార్య ఎస్.వి. సత్యనారాయణ అన్నారు.

ఈ రోజు గురువారం రవీంద్రభారతి మినీ కాన్ఫరెన్స్ హాల్ లో తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి, కవి ఏనుగు నరసింహా రెడ్డి రచించిన కవితా సంపుటి ” మూలమలుపు ” ఆవిష్కరణ సభ ఘనంగా జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన ఎస్.వి. సత్యనారాయణ మాట్లాడుతూ.. వివిధ సామజిక అంశాలకు సాహిత్యం జోడించడంలో, నిర్విరామ సాహిత్య సృజన ద్వారా తనదైన శైలిలో చక్కని కవితలను పాఠకులకు చేరవేయగల కవి ఏనుగు నరసింహా రెడ్డి అని కొనియాడారు. నిరంతర అధ్యయనం విజయానికి సంకేతమని అన్నారు. ఎస్.వి. సత్యనారాయణ తనదైన శైలిలో చేలోక్తులు విసురుతూ, సభలోని ప్రేక్షకులను నవ్వించారు. అయన ప్రసంగం ఆకట్టుకొంది.

సభాధ్యక్షత వహించిన సీఎం ఓఎస్ డి దేశపతి శ్రీనివాస్ మాట్లాడుతూ ఏనుగు నరసింహా రెడ్డి సమాజస్పృహకు మూలమలుపు పుస్తకం నిదర్శనం అన్నారు. మూలమలుపు లోని కొన్ని కవితలను వినిపించారు. ఏనుగు నరసింహా రెడ్డితో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేశారు.

అనంతరం మూలమలుపు కవితా సంపుటిని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఎం. రఘునందన్ రావు కు అంకితమిచ్చారు. కలెక్టర్ రఘునందన్ మాట్లాడుతూ మూలమలుపు పుస్తకాన్ని తనకు అంకింతమివ్వడం చాల ఆనందంగా ఉందన్నారు.

ఈ కార్యక్రమానికి సుంకిరెడ్డి నారాయణ రెడ్డి, కోయి కోటేశ్వర రావు, కొల్లాపురం విమల, ఎం. నారాయణ శర్మ తదితరులు పాల్గొన్నారు.

ఏనుగు నరసింహ రెడ్డి రచించిన మూలమలుపు కవితా సంపుటి ఆవిష్కరణ 14-June DSC_0416 DSC_0406 DSC_0398 DSC_0415 DSC_0411 DSC_0381 DSC_0379 DSC_0387 DSC_0388 DSC_0393 DSC_0435 DSC_0374
<
>

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *