భాషా సాంస్కృతిక శాఖ ఆద్వర్యంలో రవీంద్రభారతిలో ప్రతి శనివారం నిర్వహిస్తున్న నేటి “Cinivaram సినివారం” లో దర్శకులు ప్రవీణ్ సత్తారు , ఎడిటర్ ధర్మేంద్ర కాకరాల, రచయిత నిరంజన్ రెడ్డి లతో “టాక్ @ సినివారం” కార్యక్రమం, “ప్రయాణం” మరియు “యమ ప్రయాణం” లఘు చిత్రాల టీజర్ లాంచ్ మరియు చిన్నారి ” మాహిన్ ” డాన్స్ ప్రదర్శన
https://www.facebook.com/100010227249306/videos/558339027850334/
https://www.facebook.com/100010227249306/videos/558268504524053/
https://www.facebook.com/100010227249306/videos/558268004524103/
“టాక్ @ సినివారం” లో దర్శకులు ప్రవీణ్ సత్తారు గారు ఎడిటర్ ధర్మేంద్ర కాకరాల రచయిత నిరంజన్ రెడ్డి గార్లు పాల్గొని సినిమాలు, మేకింగ్ విశేషాలు మరియు వారి అనుభవాలు మనతో పంచుకున్నారు.
తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక సంచాలకులు మామిడి హరికృష్ణ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఔత్సాహిక సినిమా దర్శకులు , రచయితలు, నటీనటులకు ప్రోత్సాహం అందించే ఉద్దేశ్యంతో భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో సినివారం కార్యక్రమం రూపొందించామన్నారు. అందులో భాగంగా ఇప్పటికీ 100 పైగా షార్ట్ ఫిలిమ్స్ , డాక్యుమెంటరీలు , ఫీచర్ ఫిలిమ్స్ ప్రదర్శన చేశామన్నారు .
ఎల్బీడబ్ల్యూ (LBW), రొటీన్ లవ్ స్టోరీ, చందమామ కథలు, గుంటూర్ టాకీస్ పిఎస్వి గరుడ వేగ సినిమాల దర్శకులు ప్రవీణ్ సత్తారు మాట్లాడుతూ ఔత్సాహిక సినిమా దర్శకులకు ఓపిక చాలా అవసరం అన్నారు. చందమామ కధలు కమర్షియల్ గా విజయవంతం కాకపోయినా జాతీయ అవార్డు గెలుచుకుందన్నారు.
భారత్ లో ఇంజనీరింగ్ చేశాక అమెరికాలో చిప్ డిజైనింగ్ లో ఎమ్మెస్ చేసి ఆ తరువాత అక్కడే ఐబీఎం సంస్థలో పదేళ్ళ పాటు SAP కన్సల్టెంటునుండి మేనేజర్ స్థాయి వరకు పనిచేశానన్నారు.
సినిమాల మీద ఆసక్తితో ఉద్యోగాన్ని వదిలి భారతదేశానికి వచ్చి LBW – లైఫ్ బిఫోర్ వెడ్డింగ్ సినిమాతో దర్శకుడిగా ప్రవేశం చేశానన్నారు .
ఎడిటర్ ధర్మేంద్ర కాకరాల మాట్లాడుతూ తనకు సినిమాలంటే ఆసక్తి అని . దర్శకుడు కావాలన్న కోరిక తో నాన్నగారి సలహా మేరకు సత్యజిత్ రే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ఎడిటింగ్‌లో పీజీ డిప్లొమా చేసానని . తర్వాత ఎడిటర్ శంకర్ గారి వద్ద, దాసరి నారాయణరావు గారివద్ద అసోసియేట్ ఎడిటర్ గా పనిచేసి, దేవకట్ట దర్శకత్వం వహించిన ‘ప్రస్థానం’తో ఎడిటర్ గా తన సినీ కెరీర్ ప్రారంభించి మల్లెల తీరం , అసుర, హితుడు, ప్రవీణ్ సత్తారు గారు దర్శకత్వం వహించిన అన్ని సినిమాలకు ఇప్పటివరకు దాదాపు 20కి పైగా చిత్రాలకు ఎడిటర్ గా చేశానన్నారు.
ఐదు భాషలు అనర్గళంగా మాట్లాడుతూ శాస్త్రీయ, జానపద, వెస్టెర్న్ ఇలా అన్నిరకాల పాటలకు తన డాన్సుతో అలరించే చిన్నారి మాహిన్ గోవా ఇంటర్నెషనల్ డాన్స్ ఫెస్టివల్ కి ఎంపిక అయిన సందర్భంగా తనకు ప్రోత్సాహకంగా తన డాన్స్ ప్రదర్శనతో అందరినీ విశేషంగా అలరించింది . అనంతరం భాషా సాంస్కృతిక సంచాలకులు మామిడి హరికృష్ణ చిన్నారి మాహిన్ కి 50 ,000/- ల ప్రోత్సాహకాన్నీ అందజేశారు.
మణికాంత్, రమేష్ లు దర్శకత్వం వహించగా హరీష్ మన్రోల్ ఇతర నటీనటులు నటించిన “ప్రయాణం” మరియు “యమ ప్రయాణం” లఘు చిత్రాల టీజర్ లాంచ్ జరిగింది .