Top Bar Ad

Breaking News

24x7onlinenews.com (24.11.18): రవీంద్రభారతి, సినీవారంలో: పుస్తకాల్లో చాలా విషయాలు ఉన్నాయ, వాటిని సినిమాలుగా తీస్తే బాగుంటుంది : దర్శకురాలు నందినిరెడ్డి

పుస్తకాల్లో చాలా విషయాలు ఉన్నాయ, వాటిని సినిమాలుగా తీస్తే బాగుంటుంది : దర్శకురాలు నందినిరెడ్డి

ఇతర సినిమాలు చూసి సినిమాలు తీయకూడదని, పుస్తకాల్లో చాలా విషయాలు ఉన్నాయని వాటిని సినిమాలుగా తీస్తే బాగుంటుందని దర్శకురాలు బి.వి. నందినిరెడ్డి అన్నారు.

తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ నిర్వహిస్తున్న టాక్ ఎట్ సినివారంలో 24.11.2018 రోజున అలా మొదలైంది, జబర్దస్త్, కళ్యాణ వైభోగమే చిత్రాల దర్శకురాలు బి.వి. నందినిరెడ్డి గారితో ముఖాముఖి కార్యక్రమం జరిగింది.

సినిమారంగం ఒక ఫ్యాషన్ రంగం కాబట్టి మనం ఏ క్రాఫ్ట్స్ కి సెట్ అవ్వగలమో చూసుకొని, దాన్ని చేరుకోవడంకోసం ఒక టైంలైన్ పెట్టుకోవాలని అన్నారు. వేయిమందిలో ఒకరిద్దరు మాత్రమే దర్శకులు అవుతారని, దర్శకులు అవ్వాలనుకుంటున్నవారు అది దృష్టిలో పెట్టుకొని కష్టపడాలని తెలిపారు. మనకు నచ్చినవిధంగా ఫిలిం మేకింగ్ చేయడం కరెక్ట్ కాదని, ఎమోషన్ మరియు కంటెంట్ కనెక్ట్ అయ్యేందుకు ఒక గ్రామర్ ఉంటుందని, దాన్ని తెలుసుకొని సినిమాలు తీయలన్నారు.

ప్రపంచ తెలుగు మహాసభలకోసం తెలంగాణ రాష్ట్ర పండుగ బతుకమ్మపై పాట చేయడం తన అదృష్టమని, ఆ అదృష్టాన్ని అందించిన తెలంగాణ ప్రభుత్వంకు కృతజ్ఞతలు తెలిపారు. యంగ్ ఫిలిం మేకర్స్ కు ఫిలిం మేకింగ్ పై అవగాహన పెంచడంకోసం తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ నుండి సినివారం పేరిట ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో యంగ్ ఫిలిం మేకర్స్ తో ముఖాముఖిలో పాల్గొనడం గొప్ప ఫీలింగ్ అని పేర్కొంటూ, ఈ అవకాశాన్ని అందించిన శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ గారికి ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో భాషా సాంస్కృతిక శాఖ ఏవో రమాదేవి విచ్చేసి నందినిరెడ్డిని శాలువాతో సత్కరించారు. రమాదేవి మాట్లాడుతూ… తెలంగాణ తొలి మహిళా దర్శకురాలుగా పేరుపొందిన నందినిరెడ్డి తన మొదటి సినిమా అలా మొదలైంది సినిమాకిగాను ఉత్తమ తొలి చిత్ర దర్శకురాలిగా ప్రతిష్టాత్మక నంది అవార్డు అందుకోవడం గొప్ప విషయమని. కుటుంబ కథా చిత్రాలతోపాటు పూర్తిస్థాయి కమర్షియల్ చిత్రాలు తీయడంలో మహిళా దర్శకులు ఏ మాత్రం తీసిపోరని నందినిరెడ్డి నిరూపించారని పేర్కొంటూ, నందినిరెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.

46502197_1930188957035632_4115877845635432448_n 46516520_1930183000369561_932102267958460416_n 46519888_1930182450369616_4562443702982672384_n 46525761_1930187953702399_2396308712823193600_n 46627393_1930188967035631_861898596553850880_n 46628047_1930186233702571_9096393428987543552_n 46634215_1930187390369122_523554228459798528_n 46634230_1930181793703015_643655421160062976_n 46647916_1930184810369380_4317980710024511488_n 46686541_1929809137073614_527059737817120768_n 46696960_1930187930369068_2983581443998875648_n 46697619_1930189470368914_7219692015708012544_n 46715784_1930181753703019_1190244066034450432_n 46758578_1930187410369120_2341411518882512896_n 46768385_1930189450368916_3457643986917785600_n 46831507_1930187453702449_5067086357214527488_n
<
>

(courtesy: Cinivaram సినివారం)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *