సండే సినిమాలో “సెల్మా” చిత్ర ప్రదర్శన
తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ ప్రతి ఆదివారం నిర్వహిస్తున్న సండే సినిమాలో ఈ ఆదివారం (16.12.2018)న “సెల్మా” (అమెరికన్ చిత్ర) ప్రదర్శన జరిగింది.
యంగ్ ఫిలిం మేకర్, పైడి జైరాజ్ ప్రివ్యూ థియేటర్ టీం మెంబర్ సంతోష్ ఇస్రం ఈ సినిమాను విశ్లేషణ (క్యురేట్) చేసారు.
ఈ కార్యక్రమానికి సంచాలకులు మామిడి హరికృష్ణ విచ్చేసి ఈనాటి క్యూరేటర్ సంతోష్ ని సత్కరించారు. హరికృష్ణ మాట్లాడుతూ… ఏటూరు నాగారం ప్రాంతానికి చెందిన సంతోష్ ఇస్రం మంచి టాలెంట్ ఉన్న యువకుడు అని, అక్కడి గొట్టి కోయ ప్రజల సమస్యలను ప్రపంచానికి తెలియజేసి వాటికి పరిష్కారం చూపే దిశగా ప్రయత్నం చేస్తున్నాడని అన్నారు. సామాజిక స్పృహ కలిగిన సంతోష్ అనేక సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటూ, సినిమాటోగ్రఫీ రంగంలో అత్యంత ప్రతిభను కనబరుస్తున్నాడని పేర్కొంటూ అభినందనలు తెలిపారు.
సంతోష్ మాట్లాడుతూ… 1965లో సెల్మా నుండి మోంట్గోమేరీ వరకు జరిగిన ఓటింగ్ హక్కుల నిరసన ర్యాలీ ఆధారంగా రూపొందించబడిన ఈ చిత్రంలో సెల్మా ప్రాంతపు ప్రజా జీవితం కనిపిస్తుందన్నారు. ప్రపంచ సినిమా అంటే తెలియని తనకు, ఒక ప్రపంచ సినిమాను క్యూరేట్ చేసేంత నాలెడ్జ్ రావడానికి పైడి గారి జైరాజ్ ప్రివ్యూ థియేటర్, ముఖ్యంగా సంచాలకులు మామిడి హరికృష్ణ గారి ప్రోత్సాహమే కారణమని, సినిమారంగం లోని ఏ క్రాఫ్ట్ లోకి వెళ్లాలనుకున్నా ఇక్కడ జరిగే కార్యక్రమాలకు వచ్చి వాటి గురించి తెలుసుకోవచ్చని, అలాగే సినిమారంగ ప్రముఖులు మరియు యంగ్ ఫిలిం మేకర్స్ తో పరిచయాలు ఏర్పడుతాయని పేర్కొంటూ, ఈ అవకాశం ఇచ్చిన మామిడి హరికృష్ణ గారికి ధన్యవాదాలు తెలిపారు.
Sunday Cinema: Selma (film)
Selma is a 2014 historical drama film directed by Ava DuVernay and written by Paul Webb. It is based on the 1965 Selma to Montgomery voting rights marches led by James Bevel, Hosea Williams, Martin Luther King, Jr., and John Lewis.
Curator: Santhosh Esram
(Courtesy: Mamidi Harikrishna / Santhosh Esram)