తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, ఈ రోజు సండే సినిమా (ఎ విండో టూ వరల్డ్ సినిమా)లో 24.06.2018 రోజున “నాకిన్ ఆన్ హెవెన్స్ డోర్” (జర్మనీ) చిత్ర ప్రదర్శన ఆకట్టుకుంది
తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, సండే సినిమా (ఎ విండో టూ వరల్డ్ సినిమా)లో 24.06.2018రోజున “నాకిన్ ఆన్ హెవెన్స్ డోర్” (జర్మనీ) చిత్ర ప్రదర్శన జరిగింది.
అనంతరం, కథా రచయిత, తెలంగాణ ప్రభుత్వ పురస్కార గ్రహీత ఆడెపు లక్ష్మీపతి గారితో చిత్ర విశ్లేషణ మరియు ముఖాముఖి చర్చ జరిగింది.
ఈ కార్యక్రమానికి భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ గారు విచ్చేసి లక్ష్మీపతి గారిని సత్కరించి, జ్ఞాపికను అందజేశారు. జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మెన్ వి. ప్రకాష్ ఆత్మీయ అతిధిగా హాజరయ్యారు. ప్రదర్శించిన సినిమాను చూసి సినిమా పై విశ్లేషణ ఇచ్చారు. ఒక మంచి సినిమాను ఎంపిక చేసినందుకు క్యూరేటర్ లక్ష్మీపతి కి అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమానికి క్యూరేటర్ గా విచ్చేసిన లక్ష్మీపతి గారు “నాకిన్ ఆన్ హెవెన్స్ డోర్” చిత్ర నేపథ్యాన్ని, పాత్రల స్వభావాన్ని, వాటిలోని అంతర్గత భావాల గురించి వివిధ కోణాలనుంచి విశ్లేషణ చేసిన అనంతరం సినీ ప్రేమికులతో జరిగిన ముఖాముఖిలో పాల్గొన్నారు.
చిత్ర కథ “నాకిన్ ఆన్ హెవెన్స్ డోర్” థామస్ జాన్ దర్శకత్వంలో 1997లో విడుదలైన జర్మన్ క్రిమినల్ కామెడీ చిత్రం. ఒక మనిషి జీవితం యొక్క విలువని పరమార్థాన్ని దర్శకుడు మహాద్భుతంగా తెరకెక్కించిన ఈ చిత్రం 20వ మాస్కో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ కి అర్హత సాధించింది. వివిధ ఫిల్మ్ ఫెస్టివల్స్ లో ఎనమిది అవార్డులను గెలుచుకోవడమేకాకుండా మూడు అవార్డులకు నామినేట్ అయింది.
ఇద్దరు రోగులు (మార్టిన్ బ్రెస్ట్ మరియు రుడి వూర్లిట్జర్) ఒక ఆసుపత్రిలో కలుసుకుంటారు. ఇద్దరిది చికిత్స చేయలేని వ్యాధని తెలుసుకున్న తర్వాత, త్వరలో రాబోయే తమ మరణం గురించి మాట్లాడుకుంటుంటారు. వారు ఒక తెల్ల గులాబీని చూసినప్పుడు, రుడి సముద్రం చూడలేదని మార్టిన్ తెలుసుకుంటాడు. స్వర్గం ఎంత అందంగా ఉంటుందో సముద్రం అంత అందంగా ఉంటుందని మార్టిన్ రూడికి చెబుతాడు. వారు ఒక మెర్సిడెస్ బెంజ్ W113 క్లాసిక్ రోడ్‌స్టర్ దొంగిలించి వారి చివరి మిషనైన సముద్రం చూడటానికి బయలుదేరుతారు. నేరస్తునికి చెందిన ఆ కారులోని ట్రంక్ పెట్టెలో నేరస్తుడు దొంగిలించిన మిలియన్ డాలర్ల డబ్బు ఉందని తెలుసుకుంటారు.