హెచ్ .యం.డి.ఎ పరిధిలోని అనుమతిలేని, అనధికార లేఅవుట్ల ను గుర్తించి తగు చర్యలు తీసుకొనడానికి ఈ నెల 29 నుండి మే 5వ తేది వరకు స్పెషల్ డ్రైవ్
హెచ్ .యం.డి.ఎ పరిధిలోని అనుమతిలేని, అనధికార లేఅవుట్ల ను గుర్తించి తగు చర్యలు తీసుకొనడానికి ఈ నెల 29 నుండి మే 5వ తేది వరకు స్పెషల్ డ్రైవ్ ను నిర్వహించనున్నట్లు మున్సిపల్ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్ ఒక ప్రకటన లో తెలిపారు. ఈ స్పెషల్ డ్రైవ్ లో అసిస్టెంట్ ప్లానింగ్ అధికారులు, జూనియర్ ప్లానింగ్ అధికారులు , ప్లానింగ్ అధికారులు వారి పరిధిలోని అనుమతి లేని లేఅవుట్ల ను గుర్తించి , సంబంధిత యజమానులు / డెవలపర్స్ కు నోటీసులు జారీ చేయాలని మున్సిపల్ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి ఆదేశించారు. మే 10 వ తేది తరువాత అనధికార లేఅవుట్ల పై కఠిన చర్యలు తీసుకోవడం తో పాటు, లేఅవుట్ల ను తొలగించడం జరుగుతుందని, ఏదైనా అక్రమ లేఅవుట్లను గుర్తించిన ఎడల, నిరోధించని సదరు సంబంధిత అధికారులపై క్రమ శిక్షణ చర్యలు తీసుకొనబడుతాయని ఆయన తెలిపారు. కావున ప్రజలు ప్లాట్లు కొనుగోలు చేసేటప్పుడు నష్టపోకుండా ఉండఢానికి హెచ్ .యం.డి.ఎ వెబ్ సైట్ hmda.gov.in లో అనుమతి పొందినది, లేనిది సరి చూచుకొని అనుమతి వున్న లేఅవుట్లలోని ప్లాట్లనే కొనుగోలు చేయాలని ఆయన సూచించారు. సబ్ రిజిష్టార్లు కూడా అనుమతి లేని లేఅవుట్ల లోని ప్లాట్లను రిజిష్టరు చేయరాదని మున్సిపల్ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ అర్వింద్ కుమార్ కోరారు.