ఈ రోజు సినివారంలో “దేత్తడి తెలంగాణ పిల్ల” వీడియో ప్రదర్శన టీంతో మాట ముచ్చట
భాషా సాంస్కృతిక శాఖ – తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న సినివారంలో రాహుల్ రాజ్ వనం దర్శకత్వంలో రూపొందిన అలేఖ్య హారిక నటించిన దేత్తడి తెలంగాణ పిల్ల లఘుచిత్రాల ప్రదర్శన జరిగింది. తమడ మీడియా ఆధ్వర్యంలో తెలంగాణ యాసతో వచ్చిన ఈ దేత్తడి ఛానల్ యూట్యూబ్ ఛానల్ చరిత్రలో ఒక కొత్త రికార్డ్ సృష్టించింది. ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.
లఘు చిత్రాల ప్రదర్శన అనంతరం జరిగిన ముఖాముఖి కార్యక్రమంలో చిత్ర బృందం పాల్గొని షార్ట్ ఫిలిం మేకింగ్ విషయాలను సినీ ప్రేమికులతో పంచుకున్నారు. పలువురు సినీ ప్రేమికులు చిత్ర బృందాన్ని అభినందిస్తూ, సూచనలు అందజేశారు.
బృందాన్ని భాషా సాంస్కృతిక శాఖ నుంచి టీమ్ ని ప్రోత్సాహంతో సత్కరించి, జ్ఞాపికను అందజేశారు.
ఈనాటి సినివారంలో తమ చిత్రాల ప్రదర్శనకు అవకాశం కలిపించి, ఈ రవీంద్ర భారతిలో మా షార్ట్ ఫిల్మ్ ప్రదర్శన, అలాగే.. మమ్మల్ని ప్రోత్సాహంతో అభినందీచిన భాషా సాంస్కృతిక శాఖకు, సంచాలకులు మామిడి హరికృష్ణ గారికి, పైడి జయరాజ్ ప్రివ్యూ థియేటర్ టీంకు ధన్యవాదాలు తెలిపారు.
కార్యక్రమంలో పైడి జయరాజ్ ప్రివ్యూ థియేటర్ బృందం, ఔత్సాహిక ఫిల్మ్ మేకర్స్ పాల్గొన్నారు.