Top Bar Ad

Breaking News

24X7onlinenewscom (14.07.19), UPPAL Shilparamam: ” నృత్యదీక్షాలయ ” ఆధ్వర్యంలో అలరించిన కూచిపూడి నృత్యప్రదర్శనలు

ఉప్పల్ శిల్పారామంలో ” నృత్యదీక్షాలయ ” ఆధ్వర్యంలో అలరించిన కూచిపూడి నృత్యప్రదర్శనలు

వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా ఉప్పల్ మినీ శిల్పారామంలో ” నృత్యదీక్షాలయ ” – The Temple of Dance – లక్ష్మి శంకర్ ఆధ్వర్యంలో వారి శిష్య బృందంచే కూచిపూడి నృత్యప్రదర్శన ఆద్యంతం అలరించింది.

జయము జయము, జగదానందకారక, అష్టలక్ష్మి స్తుతి, నందకధార అన్నమాచార్య కీర్తన, శాంకరీ శ్రీరాజ రాజేశ్వరి, బాలగోపాల తరంగం మొదలైన అంశాలను కుమారి ఆశ్రిత, అంజలి, ధనుష, సహస్ర, తేజస్వి, వాణి, వేద మొదలైనవారు ప్రదర్శించి మెప్పించారు.

ప్రత్యేకంగా మహిళలు లక్నో కాటన్ చికెన్కారి వర్క్ సారీస్, డ్రెస్ మెటీరియల్స్, రాళ్ళ గాజులు, లక్క గాజులు, బందినీ చీరలు, బ్లూ పొట్టేరీ, టెర్రకోట సామాగ్రి, జ్యూట్ బాగ్స్ విరివిరిగా అమ్ముడుపోయాయి.

ఉప్పల్ శిల్పారామం ప్రకృతి అందాలను, సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించడానికి సందర్శకులు విరివిరిగా వొచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *