Top Bar Ad

Breaking News

తెలంగాణ రాష్ట్ర అవిర్భావదినోత్సవాలను కోత్తదనంతో ఘనంగా నిర్వాహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి – పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి ఆజ్మీరా చందూలాల్

తెలంగాణ రాష్ట్ర అవిర్భావదినోత్సవాలను కోత్తదనంతో ఘనంగా నిర్వాహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి – పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి ఆజ్మీరా చందూలాల్

తెలంగాణ రాష్ట్ర అవిర్భావదినోత్సవాలను కోత్తదనంతో ఘనంగా నిర్వాహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి ఆజ్మీరా చందూలాల్ వెల్లడించారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన పత్రిక విలేకరుల సమావేశంలో మంత్రి  పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం తో కలసి  పాల్గోన్నారు.

ఈ ఉత్సవాల సందర్భంగా దేశంలో మెుదటిసారిగా హైదరాబాద్ నగరంలో బైసన్ పోలో మైదానంలో  పారామోటరింగ్ ను నిర్వహిస్తున్నట్లు మంత్రి చందూలాల్ ప్రకటించారు. పర్యాటక శాఖ అద్వర్యంలో జూన్ 3 వ తేది నుండి 5 తేది వరకు ఉదయం మరియు సాయంత్రం వేళలలో జాయ్ రైడ్ ను నిర్వహిస్తున్నట్లు మంత్రి చందూలాల్ వెల్లడించారు. సాంస్కృతిక శాఖ ద్వారా 1000 మంది కళకారులతో లుంబీని పార్కు నుండి పిపుల్స్ ప్లాజా వరకు తెలంగాణ సాంస్కృతిక కళాజాతర ను నిర్వహిస్తున్నామన్నారు.  బైసన్ పోలో మైదానంలో  పారామోటరింగ్ నిర్వహణకు సంబందించిన బ్రోచర్ ను మంత్రి చందూలాల్ ఆశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం మరియు ఫారామోటరింగ్ బృంద సభ్యులు కెప్టన్  పి ఆర్ సింగ్, సుకుమార్ తో కలిసి  అవిష్కరించారు.

పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ ద్వారా రాష్ట్ర అవతరణ దినోత్సవాలను పురష్కరించుకోని నగరంలో పిపుల్స్ ప్లాజా లో తెలంగాణ ఫుడ్ పెస్టివల్ , చారిత్రక , వారసత్వ కట్టడాలకు  త్రిడి మ్యాపింగ్ లతో పాటు స్టేట్ అర్ట్ గ్యాలరీ అఫ్ అర్ట్ లో 200  మంది ప్రముఖ చిత్రకారులు చిత్రించిన చిత్రాల ప్రధర్శన ఏర్పటు చేస్తున్నామన్నారు పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు.

తెలంగాణ చరిత్ర, సాంస్కృతి,  వారసత్వాన్ని ప్రపంచానికి తెలియజేప్పేలా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని కార్యదర్శి బుర్రా వెంకటేశం పేర్కోన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజేక్టు సందర్శనకు తెలంగాణ పర్యాటక శాఖ ద్వారా ప్రత్యేక ప్యాకేజీ టూర్ ను రూపోందించామన్నారు. అందుకు సంబందించిన బ్రోచర్ ను మంత్రి చందూలాల్ తో కలసి కార్యదర్శి బుర్రా వేంకటేశం ఆవిష్కరించారు.

ఈ ఉత్సవాల సందర్భంగా జిల్లా , రాష్ట్ర , దేశ, అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ సాంస్కృతి, సాంప్రదాయాలను ప్రతిబింబించేవిధంగా సాంస్కృతి కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు తెలంగాణ పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం . రాష్ట్ర స్థాయిలో ఎంపికైన అవార్ఢు గ్రహితలకు రవీంద్ర భారతి లో జూన్ 2న  సాయంత్రం 6 గంటలకు అవార్డులను అందజేస్తామన్నారు కార్యదర్శి బుర్రా వెంకటేశం. అవార్డు గ్రహితలు  జరిగిన మార్పు ను గమనించి సాయంత్రం 6 గంటలకు రవీంద్ర భారతి వేదిక వద్దకు రావలసినదిగా కోరడమైనది.

ఈ కార్యక్రమములో పర్యాటక అభివృద్ది సంస్ధ మెనేజింగ్ డైరెక్టర్ మనోహర్ రావు, సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ పాల్గోన్నారు.

_2258 (2) 1 IPR_8158 IPR_8161 IPR_8162
<
>

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *