Top Bar Ad

Breaking News

8-Nov: హైదరాబాద్ నెక్లేస్ రోడ్డులోని వండర్ పార్కులో ఈ రోజు జరిగిన బ్రాహ్మణ ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కేటిఆర్ – రాష్ట్రంలోని పేద బ్రాహ్మణులందరికి అండగా ఉంటాం: కేటీఆర్

హైదరాబాద్ నెక్లేస్ రోడ్డులోని వండర్ పార్కులో ఈ రోజు జరిగిన బ్రాహ్మణ ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కేటిఆర్ – రాష్ట్రంలోని పేద బ్రాహ్మణులందరికి అండగా ఉంటాం: కేటీఆర్

ఈ రోజు హైదరాబాద్ నెక్లేస్ రోడ్డులోని వండర్ పార్కులో బ్రాహ్మణ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేదపండితులు మంత్రి కేటీఆర్ ను ఆశీర్వదించారు.

ఈ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ… రాష్ట్రంలోని పేద బ్రాహ్మణులందరికి అండగా ఉంటామని మంత్రి కేటీఆర్ భరోసా ఇచ్చారు. తెలంగాణ వచ్చినంక బ్రాహ్మణుల సంక్షేమానికి పెద్ద పీట వేశామని, బ్రాహ్మణుల కోసం 17 పథకాలు ప్లాన్ చేశామని, ప్రస్తుతం 5 పథకాలు మాత్రమే అమలు అవుతున్నాయని కేటీఆర్ వెల్లడించారు. ఎన్నికల తర్వాత మిగిలిన పథకాల అమలుకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. దేశం మొత్తంలో ట్రెజరీ నుంచి పురోహితులకు జీతాలు ఇస్తున్నది ఒక్క తెలంగాణ ప్రభుత్వం మాత్రమేనని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. విశ్వకల్యాణం కోసం కేసీఆర్ ఆయుత చండీయాగం చేశారని కేటీఆర్ గుర్తుచేశారు.

బ్రాహ్మణుల స్థితిగతులపై కేసీఆర్ కు మంచి అవగాహాన ఉందని, అదేవిదంగా దేవాలయాల అభివృద్ధికి వందల కోట్లు ఖర్చు చేస్తున్నారని, యాదాద్రి దేవాలయాన్ని ఎంతో శ్రద్ధతో మహా పుణ్యక్షేత్రంగా తీర్చి దిద్దుతున్నారన్నారు. కేసీఆర్ చేసిన ఆయుత చండీయాగంని కేటీఆర్ గుర్తుచేశారు. పేదరికానికి కులంతో సంబంధం లేదని మంత్రి కేటీఆర్ అభిప్రాయపడ్డారు.

ఎన్నికల్లో మీ మద్దతు కోసం వచ్చానని, మీ ఆశీర్వాదం లభించడం ఎంతో సంతోషమని బ్రాహ్మణులను ఉద్దేశించి కేటీఆర్ అన్నారు. ఈ సందర్భంగా వేదపండితులు కేటీఆర్ ను ఆశీర్వదించారు.

ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతారావు, ప్రభుత్వ సలహాదారు రమణాచారి, ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలచారి, బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ దేవీప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

51f733f5-209b-4b38-8e51-2b2b152cb7a5 575396bf-c2b5-4e1f-acd6-5bd5973ead1d 45641503_2246183082259744_741171094542614528_n 45642413_2246183362259716_2941266215017906176_n 45665112_2246183245593061_2978204308153040896_n 45695066_2246183172259735_8829125345098596352_n 45743085_2246183052259747_3310231131541995520_n 45757586_2246183025593083_4445490626821095424_n 45812758_2246183292259723_4298029375753814016_n cd966466-626b-417c-bea8-27a6b6b2ead1 d252d769-aa08-49bd-ace9-07f07baf5221 fdfd1609-0387-44c0-9c0a-c569a3469eeb KTR at brahmin aateeya sammelanam program 8-nov KTR ktrbrahmins2
<
>

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *