Top Bar Ad

Breaking News

జర్నలిస్టుల సమస్యలపై సమాచార కమీషనర్ సానుకూలత

జర్నలిస్టుల సమస్యలపై సమాచార కమీషనర్ సానుకూలత

రాష్ట్రంలోని జర్నలిస్టులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యల పట్ల ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్ళి వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తామని రాష్ట్ర సమాచార , పౌర సంబంధాల శాఖ కమీషనర్ శ్రీ అరవింద్ కుమార్ అన్నారు. సమాచార, పౌర సంబంధాల శాఖ కమీషనర్ కార్యాలయంలో శనివారం ఆయన వివిధ జర్నలిస్టు సంఘాల ప్రతినిధులతో సమావేశమై దాదాపు 3 గంటల పాటు పలు సమస్యలపై చర్చించారు. ఈ సమావేశం లో పాల్గొన్న రాష్ట్ర మీడియా ఆకాడమీ చైర్మన్ అల్లం నారాయణ మాట్లాడుతూ, జర్నలిస్టులకు ఇళ్ళ నిర్మాణం , చిన్న పత్రికల సమస్యలు, అన్ లైన్ మీడియా ప్రతినిధులకు అక్రిడిటేషన్లు జారీ విషయమై పలు సూచనలు చేస్తూ చర్చించారు.

సమావేశంలో పాల్గొన్న టి.ఎస్.యు. డబ్ల్యూ .జె. జనరల్ సెక్రటరీ విరాహత్ అలీ మాట్లాడుతూ, అక్రిడిటేషన్ల జారీకి సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన 239 జి.ఓ. లో సవరణలు చేయాలని, ఫలితంగా జర్నలిస్టుల ఎన్నో సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. టి.యుడబ్ల్యూ.జే జనరల్ సేక్రెటరీ క్రాంతి కిరణ్ మాట్లాడుతూ అక్రిడిటేషన్ లేని జర్నలిస్టులకు హెల్త్ కార్డులు జారీ చేయాలని తెలిపారు. టి.డబ్ల్యూ.జె.ఎఫ్ అధ్యక్షులు సోమయ్య మాట్లాడుతూ రిటైర్డ్  జర్నలిస్టులకు పెన్షన్ సౌకర్యం కల్పించాలని కోరారు.

సమావేశంలో పాల్గొన్న సంఘాల ప్రతినిధులు తెలిపిన సమస్యల పై సమాచార , పౌర సంబంధాల శాఖ కమీషనర్ శ్రీ అరవింద్ కుమార్ సానుకూలంగా స్పందించారు. కమీషనర్ అరవింద్ కుమార్ మాట్లాడుతూ అక్రిడిటేషన్లకు సంబంధించి ప్రస్తుతం అమలులో ఉన్న 239 జి.ఓ. లో కొన్ని సవరణలు చేసి మండల స్థాయిలో పనిచేస్తున్న జర్నలిస్టులకు, చిన్న పత్రికల వారికి అక్రిడిటేషన్ కమిటీలో ఉర్డూ  జర్నలిస్టులకు ప్రాతినిధ్యం కల్పించే విషయంలో దృష్టి సారిస్తామన్నారు. అలాగే అక్రిడిటేషన్ లేని జర్నలిస్టులకు వైద్య సహాయం అందించేందుకు, అక్రిడిటేషన్ తో హెల్త్ కార్డులు కలిగివున్న జర్నలిస్టులకు వైద్య చికిత్స అందే విషయమై సంబంధిత ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. రాష్ట్ర, జిల్లా స్థాయిలో జర్నలిస్టులకు డబుల్ బెడ్ రూం తరహాలో ఇళ్ళ నిర్మాణం, ఇతర అంశాలు అన్నింటిని ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లుతామని తెలిపారు.

సమావేశంలో సమాచార , పౌర సంబంధాల శాఖ అడిషనల్ డైరెక్టర్ నాగయ్య కాంబ్లే , టి.ఎస్.యు.డబ్ల్యూ.జె. అధ్యక్షుడు ఎన్. శేఖర్, టి.డబ్ల్యూ.జే ఎఫ్, ప్రతినిధి ఆనంద్ , తదితరులు పాల్గోన్నారు. సమావేశం అనంతరం సంఘాల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తూ, తమ సమస్యలు త్వరలో పరిష్కరిస్తారని అశాభావం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *