Top Bar Ad

Breaking News

శ్రీ వెంకటేశ్వరా స్వామి ఆలయం, జిల్లెలగూడ: అంగరంగ వైభవంగా గోదాదేవి కళ్యాణం – ఘనంగా ముగిసిన తిరుప్పావై ప్రవచనములు మరియు భక్తి గోష్ఠి గానం కార్యక్రమాలు – 14-JAN-18

అంగరంగ వైభవంగా గోదాదేవి కళ్యాణం – ఘనంగా ముగిసిన తిరుప్పావై ప్రవచనములు మరియు భక్తి గోష్ఠి గానం కార్యక్రమాలు

జిల్లెలగూడలోని శ్రీ వెంకటేశ్వరా స్వామి ఆలయ ప్రాంగణంలలో శ్రీమాన్ డింగరి రామాచార్యుల వర్యవేక్షణలో గోదాదేవి, రంగనాధస్వామిల కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా, కనుల పండువగా నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా తొలుత రంగ‌నాయ‌కుల ఉత్సవ విగ్రహాలను వీధుల మీదుగా అంగరంగ వైభవంగా ఊరేగించారు.

భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కల్యాణ మహోత్సవాన్ని తిలకించి పులకించారు. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాన్ని భక్తులకు అందచేశారు.

గత నెల రోజులుగా జరుగుతున్న తిరుప్పావై  ప్రవచనములు మరియు భక్తి గోష్ఠి గానం కార్యక్రమాలు నేటితో ఘనంగా ముగిసాయి.

భాస్కరభట్ల ఆంజనేయశర్మ గారి తిరుప్పావై ఉపన్యాసంలో భాగంగా ఈ రోజు ఆఖరిరోజు 30వ పాశురము యొక్క విశేషములు చెప్పారు.

ఈ రోజు తిరుప్పావై 30వ రోజు పాశురము, 14-JAN-2018

వంగ క్కడల్ కడైంద మాదవనై క్కేశవనై
తింగళ్ తిరుముగత్తు శేయిరైయార్ శెన్ఱిఱైంజి
అంగ ప్పఱై కొండవాత్తై అణి పుదువై
ప్పైంగమల త్తణ్ తెరియల్ పట్టర్బిరాన్ కోదై శొన్న
శంగ త్తమిర్ మాలై ముప్పదుం తప్పామే
ఇంగిప్పరిశురైప్పర్ ఈరిరండు మాల్ వరైత్తోళ్
శెంగణ్ తిరుముగత్తు చ్చెల్వ త్తిరుమాలాల్
ఎంగుం తిరువగుళ్ పెత్తిన్భుఱువర్ ఎంబావాయ్

ఈ కార్యక్రమంలో శ్రీ సిద్దాల దశరధ, అధ్యక్షులు వికాసతరంగిణి శ్రీమాన్ తోట వంశీకృష్ణ, ఆలయ అర్చకులు, ఇతర ప్రముఖులు, తదితరులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమం తెలంగాణ బాషా సాంస్కృతిక శాఖ సహకారంతో, శ్రీ శ్రీ శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి మంగళా శాసనములతో, శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవస్థానం, జిల్లెలగూడ, రంగారెడ్డి జిల్లా వారి సౌజన్యంతో, వికాస తరంగిణి మీర్పేట్ సహకారంతో, సీనియర్ జర్నలిస్ట్ వద్ది రాజు జనార్ధన రావు సమర్పణలో, జర్నలిస్ట్ కె.ఎల్. నరసింహా రావు మరియు శ్రీ వేముల రాజేశ్వర రావు సమన్వయంతో, శ్రీమాన్ డింగరి రంగాచార్యులు గారి పర్యవేక్షణలో ఘనంగా ముగిసాయి.

 

 

GODADEVI KALYANAM Dhanurmasam at Jillelaguda 14-JAN-18 IMG_20180114_185351680 IMG_20180114_200613220 IMG_20180114_201237862 IMG_20180114_201345446 IMG_20180114_201417109 IMG_20180114_201442229 IMG_20180114_201635168 IMG_20180114_201234622 IMG_20180114_185035298 IMG_20180114_185104858 IMG_20180114_185612013 IMG_20180114_200953168 IMG_20180114_201103361 IMG_20180114_201319670 IMG_20180114_201347246 IMG_20180114_201410750 IMG_20180114_201415303 IMG_20180114_201237862 IMG_20180114_200907642
<
>

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *