ఇంటర్నేషనల్ కైట్ & స్వీట్ ఫెస్టివల్ నిర్వహణ ఏర్పాట్ల పై తెలంగాణ పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం సమీక్ష
జనవరి 13 నుండి15 వరకు సికింద్రాబాద్ లోని పరేడ్ మైదానంలో జరిగే ఇంటర్నేషనల్ కైట్ & స్వీట్ ఫెస్టివల్ నిర్వహణ ఏర్పాట్ల పై క్షేత్రస్థాయిలో అధికారులతో సమీక్ష నిర్వహించారు తెలంగాణ పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం.
కైట్ & స్వీట్ ఫెస్టివల్ లో పాల్గొనేందుకు వచ్చే సందర్శకుల వాహనాల పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణ, స్వీట్స్ స్టాల్స్ ఏర్పాటు, కైట్ ప్లేయర్స్ జోన్, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ, ఫుడ్ కోర్టుల ఏర్పాటు, మంచినీటి సరఫరా తో పాటు టాయిలెట్స్ ఏర్పాటు, వ్యర్థ పదార్థాలను తొలిగింపు పై ప్రధానంగా అధికారులతో చర్చించారు బుర్రా వెంకటేశం.
పరేడ్ గ్రౌండ్ క్షేత్ర స్థాయి పర్యటనలో ప్రభుత్వ కార్యదర్శి బుర్రా వెంకటేశం తో పాటు పర్యాటక శాఖ ఇంచార్జి కమిషనర్ దినకర్ బాబు, పర్యాటక అభివృద్ధి సంస్థ M D మనోహర్ రావు, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, పర్యాటక శాఖ అధికారులు మహేష్, శశిధర్, నార్త్ జోన్ ట్రాఫిక్, పోలీసు అధికారులు, GHMC, అధికారులు, దేశంలో వివిధ ప్రాంతాల నుండి వచ్చి, తెలంగాణ లో స్థిరపడిన వివిధ రాష్ట్రాల అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.