హబ్సిగూడ అభయ ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో ” జ్ఞాన దుర్గా మ్యూజిక్ అకాడమీ ” ఆధ్వర్యంలో శ్రీమతి నాగజ్యోతి వారి శిష్య బృందం ఆలపించిన భక్తి గాన కచేరీ భక్తులను అలరించాయి
హబ్సిగూడ జెన్పాక్ట్ సమీపములో ఉన్న అభయ ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో ఈ రోజు (31-March-18) హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఉదయం నుంచే పోటెత్తిన భక్తులు. అత్యధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకొన్న భక్తులు.
మధ్యాన్నం ఆలయ యాజమాన్యం నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు.
ఈ సందర్భంగా సాయంత్రం ఆలయ యాజమాన్యం సహకారంతో నిర్వహించిన భక్తి గాన కచేరీలో ” జ్ఞాన దుర్గా మ్యూజిక్ అకాడమీ ” ఆధ్వర్యంలో శ్రీమతి నాగజ్యోతి వారి శిష్య బృందం ఆలపించిన భక్తి పాటలు భక్తులను విశేషంగా అక్కటుకొన్నాయి. ఈ భక్తిగాన కచేరీలో చిన్నారులు పడిన పలు భక్తి గీతాలు ఎంతో అక్కటుకొన్నాయి. చివరిగా బృందం పాడిన హనుమాన్ చాలీసా పఠనాన్ని భక్తులు కూడా ఆలపించారు. అనంతరం గాన బృందానికి ప్రత్యేకంగా అర్చనలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందచేశారు.