Top Bar Ad

Breaking News

24x7onlinenews.com (15.02.19): కిక్కిరిసిన సభా ప్రాంగణం, అలరిస్తున్న భక్త రామదాస జయంతి మహోత్సవాలు (మొదటి రోజు కార్యక్రమం)- ముఖ్య అతిధిగా విచ్చేసిన తెలంగాణా శాసనమండలి చైర్మన్ కె. స్వామిగౌడ్

కిక్కిరిసిన సభా ప్రాంగణం, అలరిస్తున్న భక్త రామదాస జయంతి మహోత్సవాలు -మొదటి రోజు  కార్యక్రమం

ముఖ్య అతిధిగా విచ్చేసిన తెలంగాణా శాసనమండలి చైర్మన్ కె. స్వామిగౌడ్

విచ్చేసిన శ్రీ శ్రీ శ్రీ పరమ పూజ్య పుష్ప గిరి పీఠాధిపతి విద్యా శంకర భారతీ స్వామి వారు

ప్రముఖ తెలంగాణా వాగ్గేయకారుడు భక్త రామదాసు జయంతి ఉత్సవాలు శ్రీ శ్రీ శ్రీ త్రిదండి రామానుజ చిన్నజీయర్ స్వామి వారి మంగళాశాసనములతో.. తెలంగాణా భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో భద్రాచల రామగాన సమితి, శ్రీవాణీ మ్యూజిక్ అకాడమీల సంయుక్త ఆధ్వర్యంలో శ్రీ నక్క శ్రీనివాస్ యాదవ్ – వ్యవస్థాపక చైర్మైన్, శ్రీమతి నక్క వెంకటమ్మ, శ్రీ నక్క యాదగిరి స్వామి ఎడ్యుకేషనల్ & స్పోర్ట్స్ ఫౌండేషన్ సమర్పించు…” భక్తరామదాస జయంతి మహోత్సవాలు – 2019 ” తెలుగు లలిత కళాతోరణంలో, మూడు రోజులపాటు వైభవంగా జరుగనువ్న కార్యక్రమాన్ని మొదటి రోజు తెలంగాణా శాసనమండలి చైర్మన్ కె. స్వామిగౌడ్ జ్యోతి ప్రకాశనం చేసి ప్రారంభించారు.

తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ సభాధ్యక్షత వహించారు. ప్రముఖ సంగీత విద్వాంసులు యరగొల్ల శ్రీనివాస్ సారథ్యంలో శ్రవణ నయనానందంగా సాగుతున్న ఈ కార్యక్రమంలో రోజు అత్యధిక సంఖ్యలో విచ్చేసిన విద్యార్థులు, సంగీత కళాకారులు రామదాస విరచిత దాశరథి శతక పద్యాలు, రామదాసు కీర్తనలు పాడటం విశేష ప్రాధాన్యాన్ని సంతరించుకుంది . రామదాసు కీర్తనలు, పద్యాల శ్రావ్యగానాలాపన ఆద్యంతం అతిథుల, ఆహూతుల సభా సమ్మోహనమై నిలచాయి. కిక్కిరిసిన సభా ప్రాంగణం రామనామ స్మరణలతో మార్మోగిపోయింది.

ఈ రోజు భక్త రామ దాసు జయంతి ఉత్సవాల్లో శ్రీ శ్రీ శ్రీ పరమ పూజ్య పుష్ప గిరి పీఠాధిపతి విద్య శంకర భారతీ స్వామి వారు విచ్చేసి ఆశీర్వదించి వారి అమూల్యమైన సందేశాన్ని ఇచ్చారు.

సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ , లయన్ డా. విజయకుమార్, సినీ నటుడు భానుచందర్, బీజేపి నాయకురాలు కె. గీతామూర్తి అతిథులుగా పాల్గొని రామదాసు కీర్తనల వైభవాన్ని ప్రస్తుతించి, కార్యక్రమ సారథి శ్రీనివాస యాదవ్ ను అభినందించారు .

ఈ రోజు భక్త రామ దాసు జయంతి ఉత్సవానికి శ్రీ శ్రీ శ్రీ పరమ పూజ్య పుష్ప గిరి పీఠాధిపతి విద్య శంకర భారతీ స్వామి వారు విచ్చేసిన సందర్బంగా… మాట్లాడుతున్న బీజేపీ రాష్ట్ర బేటీ బచావో బేటీ పడావో  కన్వీన్సర్ శ్రీమతి గీతా మూర్తి.

ప్రముఖ సినీ దర్శకులు, “కళాతపస్వి” డా. కె. విశ్వనాథ్ ఈ కార్యక్రమం విజయవంతం కావాలని తన ఆశీర్వచన సందేశం పంపారు.

కమిటీ చైర్మైన్ నక్క శ్రీనివాస యాదవ్, రత్నాకర శర్మ- సచ్చిదానంద కళాపీఠం, భీమ్ సేన్ మూర్తి, కె.ఎల్. నరసింహారావు- పాత్రికేయులు, కళావైభవం.కామ్ వ్యవస్థాపకులు, పూస నరసింహలు కార్యక్రమ సమన్వయం చేశారు. సుమన, స్వప్నలు గోష్ఠి గాన సమన్వయం చేశారు.

00addf6c-6c59-4529-9a17-b6b910e4a17a 0c97bd93-1a5f-4df0-95a5-222e32e811f4 0e1a862f-cbd8-4ef4-afee-a5fe8811bef6 0e06c99b-112b-464c-951f-13d2ea5c14e4 1bde0732-675d-46bd-a4d8-4fc541b971cb 1c62daf2-a7bf-434e-b11b-6450d3bb9e2b 1cbff2ea-177e-4981-a699-0bf0406bea5f 2c30b7c6-fa9e-4e9c-8604-82a4b93de787 4e3348d0-9084-4400-a8fd-959ed07d7f4e 5a46e61a-aabf-419d-a2b2-d214e6989313 5f754b13-a76b-4d5d-baed-d3e272faa6cc 6f11fba1-9416-4bf1-8cec-af7a022981eb 8aa55369-effe-41c0-b7b5-f01cf708fe9c 24e718cc-f26d-4141-ae61-c63e6ee4803f 24x7onlinenews.com-1st Day- Baktha Ramadasu Program 15.02.18 36aa0bd2-1756-4d11-b9f0-37f4e71dd52e 41d782dc-82c3-4afb-95c4-5d1ac578b324 71f8e317-fbd1-47dc-9f06-e6f7b038662c 77b4adbf-fd2c-466b-b65f-c34da43ea7e6 095efdff-1d85-46ae-841c-bef507563c14 97e8deb8-dea5-4c6e-b70b-9f93c9e5e6c0 244d60f6-01ad-422e-8b5e-0ebb0bb1fb70 499b84c1-310b-4f41-8283-9cb666f688bb 539af981-2379-4efe-a2bc-02e748062d34 687d9e03-f04e-42d6-b9f3-6fe1d1d4fdda 0873db94-1848-41a7-80c8-7a7ee33895b8 3266fef8-95da-480e-8c2e-80f2308c4767 05196c3e-d968-4519-92b5-0e2c18f57ead 5244dd3b-edf9-4489-af71-e0871f7a4b8d 9609f184-e118-46c5-acf4-38a2fde5a977 27837ce1-ab84-4c70-9082-429afdf3312f 33195b87-9582-4c7a-8283-34e46d66a63d 033371c7-e9ba-4008-8c7f-b00c542eee8b 83238e38-b662-4511-bd6c-054fa1f62e4d 709885f5-427b-44d9-911e-f5b901ebfa2e 56429568-55d1-434a-87b6-db89b9c1789a a9f25a98-2fc7-4856-8e02-48de5a8dc8ed baca3c10-63de-4bf7-b8fd-29fbba843f20 bb85f1f6-242c-4799-b2e1-45fcd572ab90 c965817d-74e6-4f62-b833-5a691edac5d4 ce675b68-5459-47a7-b27c-56b3946d61a1 d2070eb2-3f35-4f74-8d78-0bec0d5cc861 dbff2007-cf4a-45fe-857c-c98c00bbf196 e5d99a9a-782a-4a98-99d4-8341eb0955b8 e176965a-6790-4014-84f4-346859f28504 ea49c333-2647-47d1-8627-661814b0a61f ea489a3b-b976-458d-a239-e6891ac36c9b f1cdd527-cd1d-4556-8c1a-b4d2c5b183c1 f7391533-11a3-47dc-9deb-4c26617e18ca fc26e9a4-238e-496f-870f-3df854a95d27 fc038f9c-22d0-4f89-9c19-4f39a4411feb
<
>

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *