Top Bar Ad

Breaking News

సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల‌ కోసం “డిజిటౌన్” పేరుతో ప్రత్యేక టౌన్షిప్ – ప్రారంభించిన తెలంగాణ ఐటీ అసోసియేషన్ (టీటా) వ్యవస్థాపక అధ్యక్షుడు సందీప్ కుమార్ మక్తాల, ఎన్నారై అన్నపురెడ్డి అప్పిరెడ్డి

సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల‌ కోసం “డిజిటౌన్” పేరుతో ప్రత్యేక టౌన్షిప్ – ప్రారంభించిన తెలంగాణ ఐటీ అసోసియేషన్ (టీటా) వ్యవస్థాపక అధ్యక్షుడు సందీప్ కుమార్ మక్తాల, ఎన్నారై అన్నపురెడ్డి అప్పిరెడ్డి

హైదరాబాద్ ఖాతాలో మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ చేరింది. ఇప్పటికే పలు ప్రతిష్టాత్మక కంపెనీలకు వేదికగా నిలిచి దేశంతోపాటు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్న హైదరాబాద్ దేశంలోనే తొలిసారిగా `సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల కోసం ప్రత్యేక టౌన్ షిప్`ను ఏర్పాటు చేసుకొని ఇంకో గుర్తింపును సొంతం చేసుకుంది.

శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంకు చేరువలో బెంగళూరు హైవేపై `డిజిటౌన్` పేరుతో దేశంలోనే తొట్టతొలి టెక్ ఉద్యోగుల టౌన్ షిప్ ఏర్పాటైంది. డిజిటౌన్ ఏర్పాటుపై ఉత్తరాది సహా విదేశాలకు చెందిన పలువురు టెకీలు ఈ `డిజిటౌన్` టౌన్ షిప్ పై  హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ఐటీ అసోసియేషన్ తమకు సహాయసహకారాలు అందించిందని పేర్కొన్నారు. ఈ టౌన్షిప్ను శనివారం తెలంగాణ ఐటీ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు సందీప్ కుమార్ మక్తాల, ఎన్నారై అన్నపురెడ్డి అప్పిరెడ్డి ప్రారంభించగా పలువురు టెకీలు కార్యక్రమంలో పాల్గొన్నారు.

టెకీలకు నివాస ప్రాంతాలపై ఇబ్బందులు తలెత్తుతున్నాయని అన్నారు. విమానాశ్రయానికి కనెక్టివిటీ ప్రత్యేకమైన సందర్భాల్లో బెంగుళూరు వెళ్లేందుకు అనువైన ప్రాంతంలో దీనిని నిర్మించారు. బెంగళూరు హైవేలోని ముచ్చింతల్ సమీపంలోని తిమ్మాపూర్లో డిజిటౌన్ ఏర్పాటుకు సిద్ధమ య్యారు. 33 ఎకరాల్లో 200 పైచిలుకు ప్లాట్లతో `డిజిటౌన్`ను తీర్చిదిద్ది ప్రారంభించారు. హైదరాబాద్ ఇమేజ్ ను దృష్టిలో ఉంచుకుని దీనిని తీర్చిదిద్దినట్లు తెలిపారు.

హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను టెకీలలో మరింతగా పెంచేలా `డిజిటౌన్`ను ఐటీ ఉద్యోగుల ఆకాంక్షలకు అనుగుణంగా తీర్చిదిద్దామని టీటా వ్యవస్థాపక అధ్యక్షుడు సందీప్ కుమార్ మక్తాల తెలిపారు. అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, 24 గంటల వైఫై, సీసీ కెమెరాల సర్వైలెన్స్, ఇతర మౌలిక సదుపాయాలన్ని ఐటీ ఉద్యోగుల అభిప్రాయాలకు అనుగుణంగా తీర్చిదిద్దినట్లు వివరించారు. ఈ టౌన్లో ప్రత్యేక వర్క్ స్పేస్ సృష్టించనున్నామని ఆయన తెలిపారు. వర్క్ ఫ్రం హోం ఏర్పాట్లు ఉండటం వల్ల ఉద్యోగులకు ఎంతో సానుకూలంగా ఉంటుందని సందీప్ కుమార్ మక్తాల వెల్లడించారు. ముచ్చింతల సమీపంలో ప్రతిపాదిత స్మార్ట్ సిటీకి సైతం డిజిటౌన్ చేరువలో ఉండటం పలువురిన ఆకర్షించిందని ఆయన వివరిం చారు.

ఈ కార్యక్రమంలో టీటా ప్రధాన కార్యదర్శి అశ్విన్, చంద్రవలబోజు, వెంకట్ వనం,టీటా సభ్యులు శ్రీనివాస్ పిల్లి, శేఖర్రెడ్డి, వెంకట్రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *