Top Bar Ad

Breaking News

భాషా సాంస్కృతిక శాఖ రవీంద్రభారతి పైడి జైరాజ్ ప్రివ్యూ థియేటర్: నేడు ప్రారంభమయ్యే “ఫెంటాస్టిక్ ఫైవ్ ఫిల్మ్ ఫెస్టివల్ ఇంటర్నేషనల్‌” లో భాగంగా ఐదు రోజుల పాటు వార్నర్ హర్జోగ్ రెట్రోస్పెక్టీవ్ (జర్మనీ) Werner Herzog Retrospective (జర్మనీ) చిత్రాల ప్రదర్శనలు 09-April-2018

నేడు ప్రారంభమయ్యే “ఫెంటాస్టిక్ ఫైవ్ ఫిల్మ్ ఫెస్టివల్ ఇంటర్నేషనల్‌” లో భాగంగా ఐదు రోజుల పాటు వార్నర్ హర్జోగ్ రెట్రోస్పెక్టీవ్ (జర్మనీ) Werner Herzog Retrospective (జర్మనీ) చిత్రాల ప్రదర్శనలు 

హైదరాబాద్‌ను గ్లోబల్ నగరంగా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయాలకు అనుగుణంగా తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, గోతే జెంత్రంతో కలిసి ఫెంటాస్టిక్ ఫైవ్ ఫిల్మ్ ఫెస్టివల్ ఇంటర్నేషనల్‌ను నిర్వహించనుంది. నేడు ప్రారంభమయ్యే ఈ చిత్రోత్సవంలో ఐదు రోజుల పాటు జర్మనీకి చెందిన వెర్నర్ హెర్జోగ్ చిత్రాల్ని ప్రదర్శించనున్నారు.

ఈ సందర్భంగా తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ మాట్లాడుతూ 86 ఏళ్ల తెలుగు సినిమా యాక్షన్, ఫ్యాక్షన్ అనే మూసధోరణికే పరిమితమైపోయింది. ఈ తరుణంలో తెలంగాణ సినిమా అస్తిత్వాన్ని వెతుక్కోవలసిన అవసరం ఉంది. నిజమైన సినిమా అంటే ఏమిటి? ఎలా తీయాలో చూపించడానికే ఈ ఫిలిం ఫెస్టివల్‌ను ఏర్పాటుచేశాం. అంతర్జాతీయంగా ప్రామాణికం అనదగిన వివిధ భాషల సినిమాల్ని ప్రదర్శిస్తాం. గతంలో ఈ చిత్రోత్సవంలో ఇరాన్ సినిమాల్ని ప్రదర్శించాం.

వాటికి మంచి ఆదరణ లభించింది. ఈసారి జర్మన్ చిత్రసీమను మలుపుతిప్పిన గొప్ప దర్శకుడు, దార్శనికుడైన వెర్నర్ హోర్జోగ్ చిత్రాల్ని ప్రదర్శించనున్నాం. సుందర మార్మిక ప్రదేశాల నేపథ్యంలో ఎన్నో అర్థవంతమైన, ప్రయోజనాత్మక సినిమాల రూపకర్తగా హెర్జోగ్ ప్రసిద్ధిగాంచారు. ఆయన దర్శకత్వం వహించిన అగుర్రే ది వ్రాత్ ఆఫ్ గాడ్, ఎకోస్ ఫ్రమ్ ఏ సోంబర్ ఎంపైర్, ఫటా మోర్గానా, బెల్స్ ఫ్రమ్ ది డీప్, ఫిట్జ్జ్‌‌జరాల్డో చిత్రాల్ని ఐదు రోజుల పాటు ప్రదర్శిస్తాం.

నేటి నుంచి 13 వరకు జరిగే ఈ చిత్రోత్సవంలో ప్రతి రోజు సాయంత్రం ఆరు గంటలకు రవీంద్రభారతిలోని పైడి జయరాజ్ ప్రివ్యూ థియేటర్‌లో ఈ చిత్రాల్ని ప్రదర్శిస్తాం. ఈ ఫిలిం ఫెస్టివల్‌ను తెలంగాణ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఎస్.కె. జోషి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించనున్నారు అని తెలిపారు.

 

5 రోజుల జరిగే సినిమా పండుగలో నేటి తో మొదలు
నేడు …. సాయింత్రం : 6 గంటలకు రవీంద్రభారతి పైడి జైరాజ్ ప్రివ్యూ థియేటర్ లో

అగిర్రెవ్రాత్ ఆఫ్ గాడ్ (“AGUIRRE the wrath of God”)
ఇది 1972లో విడుదలైన జర్మనీ చారిత్రక డ్రామా చిత్రం. కొంత మంది స్పానిష్, పోర్చుగీస్ సైనికుల జీవితాలను కళ్లకు కట్టిన చిత్రమిది. అమెజాన్ అడవిలో అత్యంత కిష్టపరిస్థితుల్లో దీనిని తెరకెక్కించారు. ఇది ప్రపంచ ప్రజలు చూడదగ్గ సినిమా అని న్యూయార్క్ టైమ్స్ పత్రిక అభివర్ణించింది. ప్రపంచ ఉత్తమ 100 చిత్రాల్లో ఒకటిగా పేర్కొంది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *