బతుకమ్మ ఫైల్మోత్సవం 4వ రోజులో భాగంగా ఈరోజు ” ఘాజి ” సినిమా ప్రదర్శన, ఆ సినిమా దర్శకుడు శ్రీ సంకల్ప రెడ్డితో ముఖాముఖి -23-Sep-17
బతుకమ్మ ఫైల్మోత్సవం 4వ రోజులో భాగంగా ఘాజి సినిమా ప్రదర్శన ఈరోజు చేశారు. అనంతరం ఆ సినిమా దర్శకుడు శ్రీ సంకల్ప రెడ్డితో ముఖాముఖి జరిగింది. కార్యక్రమంలో యువ ఫిల్మ్ మేకర్స్ అడిగిన సందేహాలను తీర్చారు. ఈ సందర్భంగా సంచాలకులు మామిడి హరికృష్ణ మాట్లాడుతూ సబ్ మెరిన్ కథాంశంగా 100 ఏండ్ల సినిమా చరిత్రలో ఎవరు ప్రయత్నం చేయలేదు అని, సంకల్ప రెడ్డి కోసం మాత్రమే ఇన్నాళ్లు ఆ కథ ఉన్నట్లుగా ఉందని అని అన్నారు. సంకల్ప రెడ్డిగారిని సంచాలకులు ఆత్మీయ సత్కారం చేశారు. కార్యక్రమంలో డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి వంశీ, సందీప్, నటులు లక్ష్మణ్ మీసాల, తిరువీర్, యువ ఫిల్మ్స్ మేకర్స్ తేదీ తరులు పాల్గొన్నారు.
రేపటి కార్యక్రమంలో శివరాజ్ కనుమూరి దర్శకత్వంలో వచ్చిన జయమ్ము నిశ్చయమురా సినిమా ప్రదర్శన తర్వాత టీమ్ తో ముఖాముఖి ఉంటుంది.