ఈ వారం ప్రదర్శనతో దిగ్విజయంగా 52 వారాలు (మొదటి సంవత్సరం) పూర్తి చేసుకున్న ప్రతిష్టాత్మక ” సినివారం ” కార్యక్రమం
భాషా సాంస్కృతిక శాఖ ఆద్వర్యంలో సంచాలకులు మామిడి హరికృష్ణ పర్యవేక్షణలో రవీంద్రభారతిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రతీ శనివారం నిర్వహిస్తున్న “సినివారం” నేటి తో 52 వారాలు, మొదటి సంవత్సరం దిగ్విజయంగా పూర్తి చేసుకుంది.
ప్రతీ శనివారం షార్ట్ ఫిల్మ్స్/డాక్యుమెంటరీలు/ఫీచర్ ఫిల్మ్స్ రవీంద్రభారతిలో ఉచితంగా ప్రదర్శన నిర్వహిస్తున్నారు. 52 వ సినివారం లో భాగంగా ఈ రోజు 04.11.17 సినివారం కార్యక్రమంలో నివాస్ దర్శకత్వంలో వచ్చిన ” ద్రౌపతి ” , బీడీఎల్ సత్యనారాయణ గారు రూపొందించిన “హలో అమెరికా “, విజయ్ తమ్ము “నిహారిక ప్రేమకథ” మరియు రాహుల్ దర్శకత్వం వహించిన ” పోరి ప్యారి” లఘు చిత్రాలను ప్రదర్శించారు.
ఆ కాలంలో ద్రౌపది ని కాపాడటానికి కృష్ణుడు ఉన్నాడు, మరి ఈ కలియుగంలో ఏ నాథుడు లేడు అనే ఇతివృత్తంతో..విదేశాలకి వెళ్లిన మన భారతీయులు స్వదేశానికి వస్తే బాగుంటుందని తెలిపే షార్ట్ ఫిల్మ్ ఒకటి, ప్రేమకథా చిత్రం ‘నిహారిక ప్రేమ కథ’. ఇద్దరు పూర్ మిత్రులు లైఫ్ లో సెటిల్ అవ్వాలని, అలాగే ప్రేమ కథతో రూపొందింది.
ప్రదర్శన అనంతరం చిత్ర బృందాలతో ముఖాముఖీ కార్యక్రమం భాగంగా దర్శకుడు నివాస్ మాట్లాడుతు…ఇలాంటి వేదిక ఇచ్చి ప్రోత్సహిస్తున్న హరికృష్ణ గారికి సినివారం, తెలంగాణ ప్రభుత్వం వారికి కృతజ్ఞతలు తెలిపారు. రవీంద్రభారతిలో తమ సినిమాలు ప్రదర్శనలు జరగడం ఆనందంగా ఉందని , ఈ అవకాశం కలగటం ఆనందంగా ఉందని సంతోషాన్ని వ్యక్తం చేశారు.
https://youtu.be/8laQwMGTIa0
https://youtu.be/9PWzfoAS_e8
https://youtu.be/7szmiUmeL0w