బతుకమ్మ సంబరాలు చివరి రోజు బతుకమ్మ 2017 వీడియో పాటల ప్రదర్శన: ప్రదర్శన చేసిన పాటలన్నింట్లో మన కట్టు, బొట్టు, సంస్కృతి, సాంప్రదాయం, మన బతుకమ్మ తల్లి ఇలా అద్భుతమైన రూపకల్పన చేశారు – ఆర్థికశాఖ మంత్రి ఈటెల రాజేందర్
https://www.facebook.com/100010227249306/videos/525787911105446/
తెలంగాణ ప్రభుత్వం, భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ సంబరాలులో భాగంగా వారం రోజులుగా నిర్వహిస్తున్న కార్యక్రమంలో చివరి రోజు వివిధ చానెల్స్, వెబ్ చానెళ్లు ఓత్సాహిక యువత రూపొందించిన బతుకమ్మ 2017 వీడియో పాటల ప్రదర్శన జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్థికశాఖ మంత్రి ఈటెల రాజేందర్ పాల్గొని, వారు మాట్లాడుతూ… ప్రదర్శన చేసిన పాటలన్నింట్లో మన కట్టు, బొట్టు, సంస్కృతి, సాంప్రదాయం, మన బతుకమ్మ తల్లి ఇలా అద్భుతమైన రూపకల్పన చేశారు. యువ ఫిల్మ్ మేకర్స్ కి ఇలాంటి ప్రివ్యూ థియేటర్ ఒకటి ఏర్పాటు చేసి ప్రోత్సహిస్తున్న భాషా సాంస్కృతిక శాఖ వారు, ముఖ్యమంత్రి గౌ శ్రీ కె.సి ఆర్ గారి సారథ్యంలో సంచాలకులు మామిడి హరికృష్ణ గారు గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు అని, ఇంకా…ప్రపంచంలో భారతదేశం వైవిధ్యమైన దేశం అని, కుటుంబంతో కలసి చూసే ఫీచర్ సినిమాలు రావాలన్నారు.. అలాగే… సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ మాట్లాడుతూ… తెలంగాణాలో ప్రతిభకు కొదువ లేదు, రానున్న రోజుల్లో యువదర్శకులు మంచి మంచి సినిమాలు తీస్తారని అన్నారు. కార్యక్రమంలో బతుకమ్మ పాటల వీడియోస్ తీసిన గాయకులను, దర్శకులను, బతుకమ్మ ఫిల్మిత్సవంలో సమన్వయకర్తలను, ఈటెల రాజేందర్ గారు, మామిడి హరికృష్ణగారు ప్రోత్సహిస్తూ సన్మానించారు.