Top Bar Ad

Breaking News

భాషా సాంస్కృతిక శాఖ: ఈ రోజు సినివారంలో రాజ్ కుమార్ తీగారపు దర్శకత్వం వహించిన నిమ్మకాయ మరియు రిషి దర్శకత్వం వహించిన అమ్మ లఘుచిత్రాల ప్రదర్శన అక్కటుకుంది -23.06.2018

ఈ రోజు సినివారంలో రాజ్ కుమార్ తీగారపు దర్శకత్వం వహించిన నిమ్మకాయ మరియు రిషి దర్శకత్వం వహించిన అమ్మ లఘుచిత్రాల ప్రదర్శన అక్కటుకుంది

తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ నిర్వహిస్తున్న సినివారంలో 23.06.2018న రాజ్ కుమార్ తీగారపు దర్శకత్వం వహించిన నిమ్మకాయ మరియు రిషి దర్శకత్వం వహించిన అమ్మ లఘుచిత్రాల ప్రదర్శన జరిగింది.

తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ తరపున నేడు ఢిల్లీలో జాతీయస్థాయి ప్రతిష్టాత్మక స్కోచ్ అవార్డును అందుకున్న సంచాలకులు అన్న మామిడి హరికృష్ణకి యంగ్ ఫిలిం మేకర్స్ అభినందనలు తెలియజేశారు.

అనంతరం జరిగిన ముఖాముఖి కార్యక్రమంలో చిత్ర బృందం పాల్గొని షార్ట్ ఫిలిం మేకింగ్ విషయాలను సినీ ప్రేమికులతో పంచుకున్నారు. పలువురు సినీ ప్రేమికులు చిత్ర బృందాన్ని అభినందిస్తూ, సూచనలు అందజేశారు.

రవీంద్రభారతి ఇంచార్జ్ ఏవో నాగేందర్ చిత్ర బృందాలను సత్కరించి, అభినందించారు.

ఈనాటి సినివారంలో తమ చిత్రాల ప్రదర్శనకు అవకాశం కలిపించిన భాషా సాంస్కృతిక శాఖకు, సంచాలకులు మామిడి హరికృష్ణ కి, పైడి జయరాజ్ ప్రివ్యూ థియేటర్ టీంకు ధన్యవాదాలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *