యువ ఫిల్మ్ మేకర్స్ అందరికి “సినివారం” ఒక వేధిక – మామిడి హరికృష్ణ
సామాజిక, మానవీయ విలువలున్న సినిమాలు తీయాలి – డా. నందిని సిధారెడ్డి
https://www.facebook.com/100010227249306/videos/520976378253266/
ఈరోజు జరిగిన సినివారం కార్యక్రమంలో ముఖ్య అతిథి డా. నందిని సిధారెడ్డి, సాంస్కృతిక శాఖ సంచాలకులు శ్రీ మామిడి హరికృష్ణ, ప్రముక దర్శకులు శ్రీ ప్రేమ్ రాజు, “మై విలేజ్ షో ” కామెడీ షార్ట్ ఫిల్మ్స్ దర్శకులు శ్రీ శ్రీరామ్ శ్రీకాంత్, టీమ్ గంగవ్వ, రాజు, అనిల్, అంజి, తదితరులు పాల్గొన్నారు.
శ్రీ శ్రీరాం శ్రీకాంత్ దర్శకత్వంలో రూపొందిన “మై విలేజ్ షో” కామెడీ షార్ట్ ఫిల్మ్స్ ప్రదర్శన జరిగింది. మై విలేజ్ షో చానల్ రూపొందించిన సినిమాలు గ్రామ అభివృద్ధి పనులు, తెలంగాణ గ్రామాల్లో జరిగే పండుగలు,కొత్త టెక్నాలజీ పై గ్రామ ప్రజల ప్రతిస్పందనలు, గ్రామ యువత చేసే పనులను కామెడీ రూపంలో సందేశాత్మకంగా ఉన్నాయి. ఈ షార్ట్ ఫిల్మ్స్ ద్వారా గ్రామాల సంస్కృతి, సంప్రదాయాలను చూపించారు.
కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న డా. నందిని సిధారెడ్డి గారు మాట్లాడుతూ… కామెడీతో పాటు…సామాజిక సినిమాలు, మానవీయ విలువలున్న సినిమాలు తీయాలని అని అన్నారు.
సినివారం రూపకర్త, సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ గారు మాట్లాడుతూ…
తెలంగాణలో ఎవరిని ముట్టుకున్న ఒక కథ వస్తుందని, నవరసాలున్న అద్భుతమైన సౌందర్యం మన తెలంగాణలో ఉందని అందుకు ఈ మై విల్లేజ్ షో టీమ్ ఉదాహరణ అని, ఇలాంటి యువ ఫిల్మ్ మేకర్స్ అందరికి సినివారం ఒక వేధికవుతుందని, సినిమా ప్రదర్శనకు ఉచితంగా అవకాశం ఇస్తున్నామని తెలిపారు.
మై విలేజ్ షో షార్ట్ ఫిల్మ్స్
దర్శకులు శ్రీరామ్ శ్రీకాంత్ మాట్లాడుతూ… ఇప్పటివరకి 116 వీడియోలు రూపొందించారని. ఇలా గ్రామ ప్రజల్లో, యువతలో ఉన్న స్కిల్స్ ని గుర్తిస్తూ, గ్రామాల్లో ఉండే ప్రేమ ,ఆప్యాయత, అనురాగాలను అందరికి తెలపాలనే ఉద్దేశంతో ముందుకు సాగుతున్నమని అన్నారు, కార్యక్రమంలో ” మై విలేజ్ షో” టీమ్ మెంబర్స్ కదిరే.రాజు, జీల.అనిల్, గంగవ్వ, అంజిమామ, శ్రీరాం.మొండయ్య, శ్రీరాం.తిరుపతమ్మ, శ్రీరాం.దివ్యప్రభ, కట్టే.గంగారెడ్డి, అలువాల.మధు, పవన్, అభి, చంద్రమౌళి, తదీతరులు పాల్గొన్నారు.
కార్యక్రమంలో దర్శకులు ప్రేమ్ రాజ్, సినివారం టీమ్, మై విలేజ్ షో షార్ట్ ఫిలిమ్స్ అభిమానులు, తదీ తరులు పాల్గొన్నారు.
“సినివారం”
తెలంగాణ ప్రభుత్వం – భాషా సాంస్కృతిక శాఖ ఆద్వర్యంలో నిర్వహిస్తున్న “సినివారం”. ప్రతీ శనివారం షార్ట్ ఫిల్మ్స్/డాక్యుమెంటరీలు/ఫీచర్ ఫిల్మ్స్ రవీంద్రభారతిలో ఉచితంగా ప్రదర్శన కార్యక్రమం సాII 5:00 గంIIల నుంచి 9:00 గంIIల వరకు నినిర్వహించనున్నారు. సినివారంలో సినిమాకు సంబంధించిన టీసర్స్, ఆడిషన్స్, పోస్టర్ లాంచ్, ట్రైలర్స్ కి ఒక వేదిక. “టాక్ @ సినివారం” పేరుతో సినిమాకి సంబందించిన అంశాల పై చర్చ ఏర్పాటు… సినిమాకి సంబందించిన కథ, దర్శకత్వం, రచన, నటన, సాంకేతిక విభాగం, స్క్రీన్ ప్లే, DOP, పాటలు, సంగీతం వంటి ఇతర అంశాల పై చర్చ ఏర్పాటు చేస్తున్నారు.
రవీంద్రభారతిలో ఈరోజు (16-Sep-2017) కార్యక్రమం సా. 5:00 గంIIల నుంచి 9:00 గం.ల వరకు