ఉప్పల్ లోని అభి సాయి దత్త ట్రస్ట్ అనాధ ఆశ్రమానికి సోలార్ వాటర్ హీటర్ ని విరాళంగా ఇచ్చిన మేకల సంతోష్ రెడ్డి, మేకల హేమ
ఉప్పల్ లో ఉన్న అభిసాయి దత్త ట్రస్ట్ అనాధ ఆశ్రమం, సుమారు 45 మంది చిన్నారులకు ఒక పెద్ద కుటుంబం. ఆశ్రమ నిర్వహకులు కొంగల జానకమ్మ గారు, నవీన్ దండోత్కర్ ఈ చిన్నారులకు ఆశాజ్యోతులు. వీరు ఈ చిన్నారుల పట్ల చూపిస్తున్న అంకితభావం, సేవ, ఎంతో బాధ్యతతో ఇంత మంది పిల్ల సంరక్షణ పట్ల ఆకర్షితులై, పిల్లలకు తమ వంతు ఏదో సహాయం చేయాలనే ఒక మంచి సంకల్పంతో, మేకల సంతోష్ రెడ్డి గారు మరియు అయన సతీమణి మేకల హేమ గారు వారి కూతురు మేకల అంకిత రెడ్డికి అమెరికా లో జాబ్ వచ్చిన సందర్భంగా మొదటి నెల జీతంతో వారు సోలార్ వాటర్ హీటర్ ని ఆశ్రమంలో సమకూర్చారు. పిల్లలకు చలికాలంలో వేడి నీళ్లు అందించాలనే పెద్ద మనసుతో వారు సోలార్ వాటర్ హీటర్ ని అనాధ ఆశ్రమానికి ఇవ్వడం అభినందనీయం.
ఈ కార్యక్రమం సందర్భంగా పిల్లలు పాడిన పలు పాటలు, వారు చేసిన నృత్యాలు ఎంతో అలరించాయి. అనంతరం ఈ కార్యక్రమానికి విచ్చేసిన పలువురు చిన్నారులకు మిఠాయిలు పంచి పెట్టారు.
మేకల సంతోష్ రెడ్డి గారికి, మేకల హేమ గారికి, వారి కూతురు మేకల అంకిత రెడ్డి గారికి మరియు ఈ కార్యక్రమం లో పాల్గొన్న పెద్దలకు, మిత్రులకు జానకమ్మ గారు, నవీన్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
Abhi Sai Datta Trust (అభి సాయి దత్త ట్రస్ట్ అనాధ ఆశ్రమం )
(Orphan Home at Uppal)
Location at: Uppal, near Asian Cinema Mall, Hyderabad ,Telangana
Contacts numbers: 9133703366, 9666953787, 7093733366