50th Week of Cinivaram సినివారం program on 21st October 2017 (Saturday) in “Cinivaram ” at 3:00 PM at Paidi Jayaraj Theater, 2nd Floor, Ravindra Bharathi, Hyderabad
50వ వారం సినివారం! Congratulations to the young film makers,… it’s your victory… Mamidi Harikrishna – Director – Dept of Language & Culture – Govt of Telangana
ఇటీవలి కాలంలో లఘుచిత్రాలు, డాక్యుమెంటరీలు రూపొందించే యువ దర్శకులు ఎంతో మంది తమదైన సృజనాత్మకతతో ముందుకు వస్తున్నారు. తమ టాలెంట్ కి పదును పెట్టుకుంటూ కొత్తకథలతో, కథనాలతో, టెక్నిక్, టెక్నాలజీతో తమ ప్రతిభని ప్రదర్శిస్తున్నారు. వీరు తీసిన షార్ట్ ఫిల్మ్ లు, డాక్యుమెంటరీలు అద్భుతమైన ప్రశంసలు పొందుతున్నాయి.
అయితే… ఇంతటి నవ్య ఆలోచనలతో దూసుకువస్తున్న నవతరం ఫిల్మ్ మేకర్స్ కి తమ ఫిల్మ్ ని ప్రదర్శించుకునే ప్రివ్యూ థియేటర్స్ కానీ, వేదికలు కానీ కొరతగా ఉన్నాయి. ఉన్నప్పటికి అవన్నీ వ్యయభరితంగా ఉన్నాయి.
ఈ పరిస్థితిని గమనించిన మన తెలంగాణ ప్రభుత్వం – భాషా సాంస్కృతిక శాఖ వారి ఆధ్వర్యంలో రవీంద్రభారతి రెండవ అంతస్తులోని పైడి జయరాజ్ ప్రివ్యూ థియేటర్లో ప్రతీ శనివారం “సినివారం”పేరిట 49 వారాలుగా ఈ నవతరం దర్శకులు రూపొందించిన షార్ట్ ఫిల్మ్స్ డాక్యుమెంటరీలను/ఫీచర్ ఫిల్మ్ లను ప్రదర్శిస్తున్నది.
ఈ స్క్రీనింగ్ సౌకర్యాన్ని ఉచితంగా అందించి వారిని ప్రోత్సహిస్తున్నది.
అలాగే “టాక్ ఎట్ సినివారం” అని ప్రతి నెల రెండవ శనివారం సినిమా రంగానికి చెందిన అంశాలను తెలియ పరుచుటకు సినిమా రంగానికి చెందిన ప్రముఖ వ్యక్తులతో చర్చలను ఏర్పాటు చేస్తుంది.
ఔత్సాహిక యువ దర్శక-రచయిత-నటులు తాము తీసిన లఘుచిత్రాలు/డాక్యుమెంటరీలను ప్రదర్శించాలనుకునే యువ సినీ దర్శకులు ఈ “సినివారం” అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. కొత్తతరం సినిమాకి ఆహ్వానం పలుకుతున్నారు. ఇలా “సినివారం” నవతరం సినిమా దర్శకులు-రచయిత-నటీనటులు-కళాకారులు ఎంతో మందికి ఒక successful వేదికగా ఏర్పడింది.
50 వారాలు సినివారం పూర్తి చేసుకుంటుంది 21.10.2017న.
సినివారం టీమ్‌కి అభినందనలు !!
–మామిడి హరికృష్ణ