Top Bar Ad

Breaking News

*** 24x7onlinenews.com(30-May): Union Ministry of Home Affairs (MHA) issued New Guidelines to fight COVID-19 to be effective from 1st June 2020 ***

26.06.2020: శ్రీశైల దేవస్థానంలో శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారికి ఊయలసేవ

Uyala Seva performed to Sri Brahmaramba Devi Ammavaru at Srisailam Temple

శ్రీశైల దేవస్థానంలో శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారికి ఊయలసేవ

26.06.2020 Vuyala Seva Photos (2) 26.06.2020 Vuyala Seva Photos (3)
<
>

శ్రీశైల దేవస్థానం, శ్రీశైలం: లోకకల్యాణం కోసం దేవస్థానం ఈ రోజు (26.06.2020) సాయంకాలం శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారికి ఊయలసేవను నిర్వహించారు.

ప్రతి శుక్రవారం రోజు మరియు పౌర్ణమి, మూలనక్షత్రం రోజులలో ఈ ఊయలసేవ జరిపించబడుతోంది.ఈ సాయంత్రం గం. 7.30ల నుండి ఈ ఊయలసేవ నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ అర్చకస్వాములు సేవా సంకల్పాన్ని పఠించారు. తరువాత కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని మహాగణపతి పూజ జరిపించబడింది.

అనంతరం ఊయలలో వేంచేబు చేయించిన శ్రీస్వామిఅమ్మవార్లకు శాస్తోక్తంగా షోడశోపచార పూజ జరిపించబడింది.

ఆ తరువాత విశేషంగా అమ్మవారికి అష్టోత్తరం, త్రిశతి, ఖడ్గమాల, సహస్ర నామపూజలు, స్వామివారికి సహస్రనామార్చన పూజలు జరిపించబడుతాయి. చివరగా ఊయలసేవ నిర్వహించబడింది.

ఊయలసేవను పురస్కరించుకుని శ్రీస్వామిఅమ్మవార్లకు విశేషంగా పుష్పాలంకరణ, పుష్పార్చనలు జరిపించబడ్డాయి.

పుష్పాలంకరణకు గాను పలు పుష్పాలు వినియోగించబడ్డాయి.

అర్చకస్వాములు, వేదపండితులు భౌతికదూరాన్ని పాటిస్తూ ఈ ఊయల సేవను నిర్వహించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *