Top Bar Ad

Breaking News

24x7onlinenews.com (22.04.19): ఈనెల 22 నుంచి 24 వరకు రవీంద్రభారతిలో సుందరకాండ ప్రవచనాలు

ఈనెల 22 నుంచి 24 వరకు రవీంద్రభారతిలో సుందరకాండ ప్రవచనాలు

తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతికశాఖ సౌజన్యంతో దర్శనమ్ ఆధ్యాత్మిక మాసపత్రిక ఆధ్వర్యంలో రవీంద్రభారతి సమావేశ మందిరం (మొదటి అంతస్తు)లో ఈనెల 22 నుంచి 24 వరకు ప్రతిరోజూ సాయంత్రం 5.30 గంటల నుంచి రాత్రి 9గంటల వరకు శ్రీమాన్ రామానుజదాస స్వామి వారిచే “సుందరకాండ ప్రవచనములు” నిర్వహిస్తున్నారు.

ఆదివారం రవీంద్రభారతిలో “సుందరకాండ ప్రవచనములు” పోస్టర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ప్రవచన నిర్వాహకులు “దర్శనమ్” మరుమాముల వెంకటరమణ శర్మ, సీఎం సీపీఆర్వో వనం జ్వాలా నరసింహారావు, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాల చారి, జ్యోతిష్య సభల సమన్వయ కర్త భీమ్ సేన్ మూర్తి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *