Top Bar Ad

Breaking News

24x7onlinenews.com (20.07.19): భాషా సాంస్కృతిక శాఖ, రవీంద్రభారతి,“సినివారం”లో: నేటి కథలే రేపటి సినిమాలు: బిసి కమీషన్ చైర్మన్ బిఎస్ రాములు

నేటి కథలే రేపటి సినిమాలు: బిసి కమీషన్ చైర్మన్ బిఎస్ రాములు

గతంలో తెలంగాణ నేపథ్యంలో రాసిన కథలు ఇప్పుడు సినిమాలుగా వస్తున్నాయని, ప్రస్తుత కథలు కూడా రేపటిరోజున సినిమాలుగా రానున్నాయని తెలంగాణ ప్రభుత్వ బిసి కమీషన్ చైర్మన్ బిఎస్ రాములు అన్నారు.

తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ నిర్వహిస్తున్న సినివారంలో జూలై 20న షుక్రియా, భావన లఘుచిత్రాల ప్రదర్శన జరిగింది. సంచాలకులు మామిడి హరికృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బిఎస్ రాములు లఘుచిత్రాలను వీక్షించి చిత్ర బృందాలను అభినందించి, సత్కరించారు.

ఈ సందర్భంగా బిఎస్ రాములు మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో చరిత్రను సృష్టిస్తూ తెలంగాణ ఆలోచనే భారతదేశ ఆలోచనగా దేశంలోని ఇతర రాష్ట్రాలకు మార్గదర్శత్వంగా నిలుస్తుందని అన్నారు. గత నాలుగేళ్ళుగా పైడి జైరాజ్ ప్రివ్యూ థియేటర్ వేదికగా జరుగుతున్న సినిమా కార్యక్రమాలకు అనేకమంది యంగ్ ఫిలిం మేకర్స్ వచ్చి ఫిలిం మేకింగ్ కు సంబంధించిన అనేక విషయాలను తెలుసుకుంటున్నారని, వారందరూ రేపటిరోజున తెలంగాణ సినిమా ఎదుగుదలకు కృషి చేస్తారని అశాభావం వ్యక్తంచేశారు. ఈ రోజు ప్రదర్శించిన షుక్రియా, భావన లఘుచిత్రాలు కథ పరంగా, మేకింగ్ పరంగా చాలా బాగున్నాయని పేర్కొంటూ చిత్రబృందాలను అభినందించారు.

సంచాలకులు మామిడి హరికృష్ణ మట్లాడుతూ… భారతదేశంలో ఎక్కడాలేనివిధంగా ఒక ప్రభుత్వ శాఖ నుండి లఘుచిత్రాలకోసం ఒక వేదికను ఏర్పాటుచేసి యంగ్ ఫిలిం మేకర్స్ ను ప్రోత్సహించే కార్యక్రమం తెలంగాణ ప్రభుత్వ భాషా సాంప్కృతిక శాఖ మాత్రమే చేస్తుందని అన్నారు. విజయానికి తొలిమెట్టుగా ఉన్న పైడి జైరాజ్ ప్రివ్యూ థియేటర్ వేదిక నుండి అనేకమంది ఫిలిం మేకర్స్ సినిమారంగానికి వెళ్ళి తమ ప్రతిభను నిరూపించుకుంటున్నారని, దొరసాని దర్శకుడు కెవీఆర్ మహేంద్ర దర్శకత్వం వహించిన తొలి లఘుచిత్రం నిశీధి ఇదే వేదికలో ప్రదర్శించబడిందని, ఈ వేదికనుండి దాదాపు 15మంది దర్శకులను తెలుగు సినిమారంగానికి అందించబోతున్నామని పేర్కొంటూ, ఫిలిం మేకర్స్ ను అభినందించారు.

సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి మాట్లాడుతూ… లఘుచిత్రం అంటేనే తక్కువ సమయంలో ఎక్కువ కథ చెప్పడమని, చెప్పే కథ కూడా చాలా బ్రీఫ్ గా టైట్ ఎడిటింగ్ ఉండాలని పేర్కొంటూ యంగ్ ఫిలిం మేకర్స్ ను ప్రోత్సహిస్తున్న సంచాలకులు మామిడి హరికృష్ణను అభినందించారు.

అనంతరం జరిగిన ముఖాముఖి కార్యక్రమంలో చిత్రబృందాలు పాల్గొని సినీప్రియులు, యంగ్ ఫిలిం మేకర్స్ తో తమ అనుభవాలను పంచుకున్నారు.

(Courtesy: FB-Cinivaram సినివారం, Mamidi Harikrishna)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *