Top Bar Ad

Breaking News

24xonlinenews.com (15.12.18) సినివారంలో: సినిమా చూడడం ఒక కళ: సంచాలకులు మామిడి హరికృష్ణ

 సినిమా చూడడం ఒక కళ: సంచాలకులు మామిడి హరికృష్ణ

సినిమా తీయడమే కాదు, సినిమా చూడడం కూడా ఒక కళ అని, ప్రతిఒక్కరు సినిమాద్వారా ఎంతో కొంత నేర్చుకుంటారని తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ అన్నారు. తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ నిర్వహిస్తున్న టాక్ ఎట్ సినివారంలో 15.12.2018 రోజున ప్రముఖ ప్రముఖ విజువల్ ఎఫెక్ట్స్ ఆర్టిస్టు ప్రదీప్ పూడితో ముఖాముఖి కార్యక్రమం జరిగింది.

ఈ సందర్భంగా ప్రదీప్ మాట్లాడుతూ… డైరెక్టర్ ఐడియాకు అనుగుణంగా రియల్ టైంలో తీయలేనివాటిని చూపించడానికి విజువల్ ఎఫెక్ట్స్ ఉపయోగపడుతాయని, విజువల్ ఎఫెక్ట్స్ గురించి తెలియడంవల్ల ఒక దర్శకుడు తనకుతానుగా షాట్ ని విజువలైజ్ చేసుకొని, అందుకు తగ్గట్టుగా షూట్ చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. తాను చిన్నప్పుడు చూసిన సినిమాల్లో యుద్ధ సన్నివేశాలు అందులోని ఎఫెక్ట్స్ తనకు బాగా నచ్చడంతో విజువల్ ఎఫెక్ట్స్ నేర్చుకున్నానని పేర్కొంటూ, యంగ్ ఫిలిం మేకర్స్ విజువల్ ఎఫెక్ట్స్ పై అడిగిన ప్రశ్నలకు సలహాలు, సూచనలు అందించారు.

సంచాలకులు మామిడి హరికృష్ణ విచ్చేసి ప్రదీప్ ని శాలువాతో సత్కరించారు. హరికృష్ణ మాట్లాడుతూ… నేడు కంటెంట్, క్రియేటివిటీ, కంప్యూటర్ గ్రాఫిక్ తో సరికొత్త సినిమాలు వస్తున్నాయని, విజువల్ ని ఇంట్రెస్ట్ గా మార్చేందుకు విజువల్ ఎఫెక్ట్స్ ప్రముఖ పాత్ర వహిస్తాయని, పాతతరంలోనే ట్రిక్ ఫోటోగ్రఫీని ఉపయోగించి అద్భుతమైన సన్నివేశాలను తీశారని అన్నారు. తక్కువకాలంలోనే విజువల్ గ్రాఫిక్స్ లో ప్రదీప్ మంచి పేరు సంపాదించి, ప్రముఖ చిత్రాలకు విజువల్ గ్రాఫిక్స్ అందిస్తున్నాడని పేర్కొంటూ, ఈనాటి టాక్ ఎట్ సినివారంకి వచ్చి యంగ్ ఫిలిం మేకర్స్ తో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొని, విజువల్ ఎఫెక్ట్స్ పై తన అనుభవాలు మరియు విలువైన సలహాలు అందించినందుకు ధన్యవాదాలు తెలిపారు.

48354960_1960271874027340_1416454049280032768_n 48089323_1958648107523050_390242463681347584_n 48425783_1960269574027570_1083087797390147584_n 48278026_1960269334027594_6320743918862336000_n 48275677_1960270490694145_5375161058526756864_n 48214867_1960270214027506_4988836270739292160_n
<
>

(courtesy: Cinivaram సినివారం)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *