Top Bar Ad

Breaking News

*** 24x7onlinenews.com(30-May): Union Ministry of Home Affairs (MHA) issued New Guidelines to fight COVID-19 to be effective from 1st June 2020 ***

24x7onlinenews.com (14.04.19): సైన్స్ ఫిక్షన్ సినిమాలు ప్రేక్షకుల ఊహాశక్తిని పెంచుతాయి: భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ

సైన్స్ ఫిక్షన్ సినిమాలు ప్రేక్షకుల ఊహాశక్తిని పెంచుతాయి: భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ

సైన్స్ ఫిక్షన్ సినిమాలు ప్రేక్షకుల ఊహాశక్తిని పెంచుతాయని, అందుకే వాటికి ప్రేక్షకుల నుండి విశేష స్పందన లభిస్తుందని తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ గారు అన్నారు.

తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ ప్రతి ఆదివారం నిర్వహిస్తున్న సండే సినిమాలో 2019, ఏప్రిల్ 14న బ్లేడ్ రన్నర్ (అమెరికన్ చిత్రం) ప్రదర్శన జరిగింది. జయప్రకాష్ తెలంగాణ గారు వచ్చి ఈ సినిమాను విశ్లేషణ (క్యురేట్) చేసారు. ఈ కార్యక్రమానికి సంచాలకులు మామిడి హరికృష్ణ గారు విచ్చేసి జయప్రకాష్ ను అభినందించి, శాలువాతో సత్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… భారతదేశ విలువలకు ప్రతికగా నిలిచిన రాముడి శ్రీరామనవమి, భారత రాజ్యాంగాన్ని రచించిన భారతరత్న డా. బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి ఒకేరోజు రావడం విశేషణమైనదని, ఇదేరోజున ఒక మంచి సైన్స్ ఫిక్షన్ సినిమాను ప్రదర్శించుకోవడం బాగుందన్నారు. మనం చూడని ఒక కొత్తకాలాన్ని, కొత్తలోకాన్ని చూపిస్తూ ఊహాత్మక ప్రపంచానికి ఈ సైన్స్ ఫిక్షన్ సినిమాలు మనల్ని తీసుకెలుతాయని, దానిద్వారా ప్రేక్షకులు కొత్త అనుభూతిని పొందుతారని తెలిపారు.

ఇప్పటివరకు తీసిన సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో బ్లేడ్ రన్నర్ చిత్రం అత్యుత్తమ చిత్రాలలో ఒకటిగా విశిష్ట గుర్తింపు పొందిందని, 1982లోనే భవిష్యత్‌ను (2019) చూపించడం ద్వారా నిర్మాణ రూపకల్పన పరంగా ఈ చిత్రం అనేక ప్రశంసలు అందుకుందని పేర్కొంటూ, గత 15ఏళ్ళుగా తెలంగాణ సినిమాపై కృషిచేస్తూ, తెలంగాణ ఫిలింమేకర్స్ ను ప్రోత్సహిస్తున్న యంగ్ ఫిలింమేకర్ జయప్రకాష్ ను అభినందించారు.

జయప్రకాష్ మాట్లాడుతూ… తెలుగులో చాలా తక్కువ సంఖ్యలో సైన్స్ ఫిక్షన్ సినిమాలు వస్తున్నాయనుకుంటున్న తరుణంలో కొంతమంది కొత్త దర్శకులు అలాంటి కథాంశాలతో సినిమాలు రూపొందించి విజయాన్ని సాధించారన్నారు.

బ్లేడ్ రన్నర్ యాక్షన్ చిత్రమైనప్పటికీ స్ర్కీన్ ప్లే పరంగా అద్భుతంగా ఉండడంవల్ల ఈ సినిమాను క్యూరేట్ చేయడానికి ముందుకు వచ్చానని పేర్కొంటూ, యంగ్ ఫిలింమేకర్స కోసం ఇంతగొప్ప వేదిను అందించిన మామిడి హరికృష్ణ గారికి ధన్యవాదాలు తెలిపారు.

 

చిత్ర విశేషాలు
బ్లేడ్ రన్నర్ 1982లో రిడ్లీ స్కాట్ దర్శకత్వంలో విడుదలైన అమెరికన్ సైన్స్ ఫిక్షన్ సినిమా. హ్యారిసన్ ఫోర్డ్, రుట్జర్ హయర్, సీన్ యంగ్ తదితరులు నటించిన ఈ చిత్రం ఫిలిప్ కె. డిక్ రాసిన డు ఆండ్రోయిడ్స్ డ్రీమ్ ఆఫ్ ఎలక్ట్రిక్ షీప్? నవల ఆధారంగా రూపొందించబడింది. 2019 సంవత్సరం నేపథ్యంలో తీసిన ఈ చిత్రంలో మానవ స్వార్థం మూలంగా రోబోలు చేసే ప్రమాదకర పనులను, వాటిని అంతమొందించడానికి బ్లేడ్ రన్నర్స్ గా పిలవబడే ప్రత్యేక పోలీసు అధికారులు చేసిన ప్రయత్నాలు చూపించబడ్డాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *