ఘనంగా ముగిసిన మృణాళ్ సేన్ ఫిలిం ఫెస్టివల్
తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ వారి ఫెంటాస్టిక్ ఫైవ్ ఫిలిం ఫెస్టివల్ లో భాగంగా ప్రసిద్ధ భారతదేశ దర్శకుడు “మృణాల్ సేన్” కు నివాళిగా నిర్వహిస్తున్న “మృణాల్ సేన్ ఫిలిం ఫెస్టివల్” ముగింపు కార్యక్రమం శుక్రవారం రవీంద్రభారతిలోని పైడి జైరాజ్ ప్రివ్యూ థియేటర్ లో జరిగింది.
సంచాలకులు మామిడి హరికృష్ణ మాట్లాడుతూ…భారతదేశం మొత్తంలో మృణాళ్ సేన్ కు నివాళిగా ఫిల్మోత్సవం నిర్వహించిన మొట్టమొదటి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమని అన్నారు. గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు హైదరాబాద్ జీవన సంస్కృతిని గంగా యమునా తెహజీబ్ చెప్తూ హైదరాబాద్ ను విశ్వనగరంగా తీర్చిదిద్దడానికి ప్రణాళికలు రూపొందిస్తున్న తరుణంలో ఆ స్ఫూర్తితో తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ నుండి వివిధ రాష్ట్రాల భాషలను, సంస్కృతిలను, కళలను గౌరవిస్తున్నామన్నారు.
అందులో భాగంగా వివిధ రాష్ట్రాల కమ్యూనిటీ సంస్థలతో అనేక కార్యక్రమాలు రూపొందిస్తున్నామని పేర్కొంటూ, సోమవారం నుండి శుక్రవారం వరకు జరిగిన ఈ ఫిలిం ఫెస్టివల్ ను విజయవంతం చేసినందుకు ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు.
మూవింగ్ ఇమేజెస్ సంస్థ ప్రతినిధి సంఘమిత్ర మాలిక్ మాట్లాడుతూ… ఈ ఫెస్టివల్ లో ప్రదర్శించిన 5 సినిమాలు ప్రతిఒక్కరూ మిస్సవ్వకుండా చూడాల్సిన చాలా మంచి సినిమాలని పేర్కొంటూ ఈ ఫిలిం ఫెస్టివల్ ని నిర్వహించిన భాషా సాంస్కృతిక శాఖకు, సంచాలకులు మామిడి హరికృష్ణ గారికి ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పైడి జైరాజ్ ప్రివ్యూ థియేటర్ టీం, భాషా సాంస్కృతిక శాఖ సిబ్బంది మరియు రవీంద్రభారతి సిబ్బంది పాల్గొన్నారు.
తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ – ఫెంటాస్టిక్ ఫైవ్ ఫిలిం ఫెస్టివల్ – మృణాల్ సేన్ ఫిలిం ఫెస్టివల్ లో నేటి సినిమా
11వ తేది – ఏక్దిన్ అచానక్:
మృణాల్‌సేన్ దర్శకత్వంలో 1989లో వచ్చిన ఈ చిత్రం రామపాద చౌదురి రాసిన ‘బీజ్’ అనే బెంగాళీ నవల రూపొందించబడింది. మృణాల్‌సేన్ తీసిన గొప్ప సినిమాల్లో ఒకటైన ఈ చిత్రంలో శ్రీరామ్ లాగూ, షబానా ఆజ్మీ, అనిల్ చటర్జీ, అపర్ణ సేన్, రూపా గంగూలీ తదితరులు నటించారు. ఒక ఇంటిలో నలుగురు పాత్రల మధ్య ఊపిరి బిగపట్టి చూసేలా తీసిన ఈ చిత్రం హింది సినీ చరిత్రలో ఒక మరపురాని సినిమా. 1989 జాతీయ చలన చిత్ర అవార్డుల్లో ఈ చిత్రం ఉత్తమ సహాయనటి (ఉత్తరా బాక్కర్) విభాగంలో బహుమతిని అందుకుంది.