Top Bar Ad

Breaking News

24X7onlinenews.com(04.06.19): శిల్పారామంలో ఘనంగా ముగిసిన నాలుగు రోజుల తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సంబరాలు

శిల్పారామంలో ఘనంగా ముగిసిన నాలుగు రోజుల తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సంబరాలు

నాలుగు రోజుల తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సంబరాలు శిల్పారామంలో ఈ రోజ్జు ముగిసాయి. పచ్చని వాతావరణంలో, ప్రకృతి ఒడిలో శాస్త్రీయ మరియు జానపద నృత్యాలు ఎంతగానో అలరించాయి.

శ్రీమతి అర్చన గూటి తన బృందంతో కూచిపూడి ప్రదర్శన ఆద్యంతం ఆకట్టుకుంది. బ్రహ్మాంజలి, గణేశా పంచరత్న, థిల్లాన, స్వాగతం శ్రీ కృష్ణ వంటి అంశాలను బృందం ప్రదర్శించి మెప్పించారు.

సౌత్ సెంట్రల్ జోన్ కల్చరల్ సెంటర్ నాగపూర్ వారి ఆధ్వర్యంలో మహారాష్ట్ర లావాని నృత్యం, మధ్యప్రదేశ్ బారేడి నృత్యం, ఛాతిస్గడ్ కర్మ నృత్యం, డొల్లుకుణిత – కర్ణాటక రాష్ట్ర డప్పు నృత్యాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి.

నాలుగు రోజులు సందర్శకులు అధిక సంఖ్యలో పాల్గొని ఉత్సవాలను జయప్రదం చేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *