కాస్సెప్ట్ కు తగ్గ టైటిల్ ఉండేలా చూడండి: మామిడి హరికృష్ణ
సినివారంకి వచ్చిన యువ కళాకారుల్లో ఎక్కువశాతం మొదటిసారి వేదికను ఎక్కినవారే ఉన్నారని మామిడి హరికృష్ణ గారు అన్నారు. తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ నిర్వహిస్తున్న సినివారంలో 22.12.2018న సుధీర్ దర్శకత్వం వహించిన పెండ్లి పిల్ల,నరేష్ దర్శకత్వం వహించిన వన్ సెకండ్, సుధారాం దర్శకత్వం వహించిన జడ్జ్మెంట్ లఘుచిత్రాల ప్రదర్శన, ముఖాముఖి కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మామిడి హరికృష్ణ గారు చిత్ర బృందాలను అభినందించి, షాలువాలతో సత్కరించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ… యంగ్ ఫిలింమేకర్స్ ను ప్రోత్సహించడంకోసం సినివారం వేదికను ఏర్పాటుచేశామని, ఈ వేదిక ద్వారా ఎంతోమంది కళాకారులు తమ ప్రతిభను నిరూపించకుంటున్నారని, వారందరిలో మొదటిసారి వేదికను ఎక్కినవారే ఎక్కువశాతం ఉన్నారని అన్నారు. అమెరికాలో పుట్టిన అమ్మాయి, పెళ్ళితో పల్లెటూరిలోని అత్తగారింటికి వచ్చి అక్కడి మనుషులు ఆప్యాయతలను పొందే కథాంశంతో రూపొందిన పెండ్లిపిల్ల షార్ట్ ఫిలిం హృదయాన్ని హత్తుకుందని, పెండ్లిపిల్ల అనే టైటిల్ తోనే 100శాతం మార్కులు సాధించిదన్నారు. ప్రేమలో గెలుపోటములు సహజమని, ఓడిపోతే చనిపోవడం కాదు, ఆ ప్రేమను తల్లిదండ్రులతో ఒప్పించి పెళ్లి చేసుకోవాలని చూపించిన వన్ సెకండ్ షార్ట్ ఫిలిం, చెడుదారిలో నడుస్తున్న యువత ఏనాటికైనా దాని పర్యావసానాన్ని అనుభవించాల్సివస్తుందని చూపించిన జడ్జ్మెంట్ షార్ట్ ఫిలింలు కూడా బాగున్నాయన్నారు.
చిత్ర యూనిట్ మాట్లాడుతూ… షార్ట్ ఫిలిం ప్రదర్శనకు సినివారం అని ఒక కార్యక్రమం పెట్టి దానికి పైడి జైరాజ్ ప్రివ్యూ థియేటర్ ను ఏర్పాటుచేయడం వల్ల తాము తీసిన షార్ట్ ఫిలింలను అనేకమందికి ప్రత్యక్షంగా చూపించే అవకాశం లభిస్తుందని, ముఖాముఖి కార్యక్రమంలో ఫిలిం మేకింగ్ కి సంబంధించిన అనేక విషయాలు తెలుకోవచ్చని చెబుతూ, ఈ అవకాశం ఇచ్చిన భాషా సాంస్కృతిక శాఖకు మరియు మామిడి హరికృష్ణ గారికి ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ యువ నాటకోత్సవం బ్రోచర్, ది షో మస్ట్ గో ఆన్ నాటిక పోస్టర్ల విడుదల జరిగింది.
(courtesy: Cinivaram సినివారం)