Top Bar Ad

Breaking News

*** 24x7onlinenews.com(30-May): Union Ministry of Home Affairs (MHA) issued New Guidelines to fight COVID-19 to be effective from 1st June 2020 ***

24.06.2020: శ్రీశైల దేవస్థానంలో వీరభద్రస్వామికి (జ్వాలావీరభద్రస్వామివారికి) విశేష పూజలు

శ్రీశైల దేవస్థానంలో వీరభద్రస్వామికి (జ్వాలావీరభద్రస్వామివారికి) విశేష పూజలు

Vishesha Pooja performed to Jwala Veerabhadra Swamy at Srisailam Temple

శ్రీశైల దేవస్థానం, శ్రీశైలం: లోక కల్యాణం కోసం దేవస్థానం ఈ రోజు (24.06.2020) సాయంకాలం ఆలయ ప్రాంగణంలోని వీరభద్రస్వామివారికి (జ్వాలావీరభద్రస్వామివారికి) విశేషపూజలను నిర్వహించడం జరుగింది.

ఆలయప్రాంగణంలో మల్లికార్జునస్వామివారి ఆలయానికి ఉత్తరభాగంలో మల్లికా గుండానికి ప్రక్కనే ఉన్న వీరభద్రస్వామి జ్వాలామకుటంతో పదిచేతులతో విశిష్ట రూపంలో దర్శనమిస్తాడు. శిల్పశాస్త్ర పరిభాషలో ఈ స్వామికి అఘోరవీరభద్రమూర్తి అని పేరు కూడా ఉంది. స్వామివారికి ప్రక్కనే దక్షప్రజాపతి కనిపిస్తాడు. ఈ స్వామిని పరివార ఆలయాలలో భాగంగా ప్రతినిత్యం పూజించడం జరుగుతోంది.

కాగా ప్రతి బుధవారం ప్రదోషకాలంలో విశేష అభిషేకం కార్యక్రమం దేవస్థానం నిర్వహిస్తోంది.

ఈ పూజవలన లోకశాంతి, దుర్భిక్షనివారణ, భక్తుల అనుకున్న కోరికలు నెరవేరుతాయి. ముఖ్యంగా క్షేత్ర అభివృద్ధి జరుగుతుంది.

కాగా ఈ పూజలలో ముందుగా కార్యక్రమం నిర్విఘ్నంగా జరిగేందుకు మహాగణపతిపూజను జరిపించబడింది.

తరువాత వీరభద్రస్వామికి పంచామృతాలతోనూ, 5రకాల ఫలోదకాలతోనూ, గంధోదకం, భస్మోదకం, పుష్పోదకం, బిల్వోదకం, హరిద్రాదోకంతోనూ మరియు మల్లికా గుండంలోని శుద్ధజలంతో విశేష అభిషేకం జరిపించారు.

ఈ అభిషేకాల తరువాత విశేషంగా స్వామివారికి పుష్పార్చనను చేసారు.

అర్చకస్వాములు భౌతికదూరాన్ని పాటిస్తూ జ్వాలావీరభద్రస్వామికి విశేషార్చనలు జరిపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *