Top Bar Ad

Breaking News

21.09.19: ఆహార బలవర్ధీకరణ పై సమీక్ష సమావేశం నిర్వహించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి

ఆహార బలవర్ధీకరణ పై సమీక్ష సమావేశం నిర్వహించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి

తెలంగాణ రాష్ట్రంలో Food Fortification(ఆహార బలవర్ధీకరణ) కార్యక్రమాలను విస్తృతం చేసేందుకు వైద్య ఆరోగ్య శాఖకు GAIN సహకారంతో కర్ణాటక హెల్త్ ప్రమోషన్ ట్రస్ట్ (KHPT) Technical Support Unit గా పనిచేస్తుందని  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.ఎస్.కె.జోషి తెలిపారు.

శనివారం బి.ఆర్.కె.ఆర్ భవన్ లో Food Fortification పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, పౌరసరఫరాల కమీషనర్ అకున్ సభర్వాల్, విద్యాశాఖ కమీషనర్ విజయ్ కుమార్, మహిళ, శిశుసంక్షేమ శాఖ డైరెక్టర్ విజయేంద్ర బోయి, తెలంగాణ ఎస్.సి వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్ స్టిట్యూషన్ సెక్రటరీ ప్రవీణ్ కుమార్, బిసి సంక్షేమ గురుకుల విద్యాలయాల కార్యదర్శి మల్లయ్య బట్టు, న్యూట్రీషన్ కన్సల్టెంట్  జానకి శ్రీనాథ్, కర్ణాటక హెల్త్ ప్రమోషన్ ట్రస్ట్(KHPT) మేనేజింగ్ ట్రస్టీ గురురాజ్ పాటిల్, గ్లోబల్ అలయన్స్ ఫర్ ఇంప్రూవుడ్ న్యూట్రేషన్ GAIN ప్రతినిధి సౌమ్య మిశ్రా తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సి.యస్ మాట్లాడుతూ KHPT సహకారంతో తెలంగాణ రాష్ట్ర పౌరులకు, భవిష్యత్ తరాలకు బలవర్ధక ఆహారం అందించేందుకు అథారిటిని ఏర్పాటు చేసే విషయమై నివేధిక రూపొందించాలని అన్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖ ద్వారా Rice Fortification కార్యకలాపాలు చేపట్టాలని, ఫోర్టిఫైడ్ రైస్ Kernel Plant ఏర్పాటు చేయడంతో పాటు రాష్ట్రంలో పండిన బియ్యాన్ని ఫోర్టిఫై చేయడానికి చర్యలు చేపట్టాలని తెలిపారు.  పౌరసరఫరాల శాఖ కమీషనర్, విద్యాలయాల సంస్ధలు, మహిళా శిశు సంక్షేమ శాఖ, Fortification వలన కలిగే లాభాలపై ప్రచారం, Advocacy అమలు చేయడానికి అవసరమైన చర్యలు తీసుకుంటారన్నారు. జయశంకర్  విశ్వవిద్యాలయాల ద్వారా ఇతర రాష్ట్రాల్లో Impact Evaluation, Efficacy Assessment కు సంబంధించి సహకారం అందివ్వాలని అన్నారు. పాలు బియ్యం, నూనెలను తక్కువ ఖర్చుతో న్యూట్రియన్స్ ను అందివ్వవచ్చని నిపుణులు తెలిపారు. ఫుడ్ సేఫ్టి అండ్ స్టాండర్డ్ అథారిటి ఆఫ్ ఇండియా Food Fortification కు సంబంధించి రెగ్యులేషన్ లను జారీ చేసిందని తెలిపారు.  పాలు, బియ్యం, నూనె, గోదుమ పిండి ల Fortification లో విజన్ చార్ట్ ను రూపొందించాలన్నారు. ఆహార బలవర్ధీకరణకు అవసరమయ్యే వ్యయాన్ని కూడా సమీక్షించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *