Top Bar Ad

Breaking News

14.05.19: “నకిలీ పత్తి విత్తనాలు మరియు కలుపు మందును తట్టుకునే పత్తి సాగు చేసినా, విత్తనాలు అమ్మినా కఠిన చర్యలు” అనే సూచనలు గల పోస్టర్ ను విడుదల చేసిన వ్యవసాయ కమిషనర్  రాహుల్ బొజ్జా, ఐ.ఎ.ఎస్. 

“నకిలీ పత్తి విత్తనాలు మరియు కలుపు మందును తట్టుకునే పత్తి సాగు చేసినా, విత్తనాలు అమ్మినా కఠిన చర్యలు” అనే సూచనలు గల పోస్టర్ ను విడుదల చేసిన వ్యవసాయ కమిషనర్  రాహుల్ బొజ్జా, ఐ.ఎ.ఎస్. 

      14 మే,  2019 న  వ్యవసాయ కమిషనర్ కార్యాలయంలో అదనపు వ్యవసాయ సంచాలకులు, ఉప వ్యవసాయ సంచాలకులు, సహాయ సంచాలకులు మరియు ఇతర అధికారులతో వ్యవసాయ కమిషనర్ శ్రీ రాహుల్ బొజ్జా, ఐ.ఎ.ఎస్., సమావేశమయ్యారు.

ఈ సమావేశంలో శ్రీ రాహుల్ బొజ్జా, ఐ.ఎ.ఎస్. గారు తన కార్యాలయంలోని అదనపు వ్యవసాయ సంచాలకులు, ఉప వ్యవసాయ సంచాలకులు, సహాయ సంచాలకులు మరియు ఇతర అధికారులతో సమావేశమై,  నకిలీ పత్తి విత్తనాలు, కలుపు మందును తట్టుకునే పత్తిసాగు చేసినా, విత్తనాలు అమ్మినా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

అదే విధంగా నకిలీ పత్తి విత్తనాలు మరియు కలుపు మందును తట్టుకునే బి.టి. విత్తనాలు మరియు లూజు విత్తనాలను అమ్ముతున్నట్లు  సమాచారం అందిన వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

ఈ సందర్భంగా పలు సూచనలతో కూడిన పోస్టరన్ ను వ్యవసాయ కమీషనర్ కార్యాలయంలో  అదనపు వ్యవసాయ సంచాలకులు, ఉప వ్యవసాయ సంచాలకులు, సహాయ సంచాలకులు మరియు ఇతర అధికారుల సమక్షంలో విడుదలు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *