Top Bar Ad

Breaking News

13 నుంచి 15వ తేదీ వరకు అంతర్జాతీయ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్

13 నుంచి 15వ తేదీ వరకు అంతర్జాతీయ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్

హైదరాబాద్ జనవరి 7: ఈ నెల 13నుంచి 15వ తేదీ వరకు నగరంలోని సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో అంతర్జాతీయ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ ను నిర్వహించనున్నారు. ఈ ఉత్సవానికి సంబంధించిన బ్రోచర్ ను రాష్ట్ర పర్యాటక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం విడుదల చేశారు.

ఈ సందర్భంగా బుర్రా వెంకటేశం మాట్లాడుతూ..కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ ఈసారి అత్యంత ఆకర్షణీయంగా ఉంటుందన్నారు. భారత దేశ సంస్కృతిని చాటే విధంగా ఈ ఫెస్టివల్ ను నిర్వహిస్తామని పేర్కొన్నారు. దేశంలోని ఇతర రాష్ట్రాల మహిళలు, పలు దేశాలకు చెందిన వారు ఆయా రాష్ట్రాలు, దేశాల స్వీట్స్ ను ఈ ఉత్సవాల్లో ప్రదర్శిస్తారని వెల్లడించారు. అదేవిధంగా పలు దేశాలకు చెందిన పతంగులను ఈ ఉత్సవాల్లో భాగంగా ఎగురవేస్తారని చెప్పారు. గత ఏడాది కైట్, స్వీట్ ఫెస్టివల్ కు 7లక్షల మంది వచ్చారని, ఈ దఫా కూడా 10లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

IPR_8632 IPR_8634 IPR_8638 IPR_8646 IPR_8657 IPR_8659 IPR_8666 IPR_8673 IPR_8682 IPR_8690 IPR_8705 IPR_8708
<
>

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *